భారత క్రికెట్ ఆటగాళ్ల జెర్సీలపై ఇక ఒప్పో మొబైల్ బ్రాండ్ లోగో కనిపించనుంది. ఇప్పటిదాకా కొనసాగిన స్టార్ ఇండియా గ్రూప్ తమ ఒప్పందాన్ని కొనసాగించేందుకు ఆసక్తి చూపలేదు.దీంతో ప్రముఖ మొబైల్ ఉత్పత్తిదారు ఒప్పో కంపెనీతో బీసీసీఐ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.