ధోనీ, కోహ్లీ ఫిట్‌నెస్‌ రహస్యం ఇదే | diet of India's two fittest cricketers Virat Kohli vs MS Dhoni | Sakshi
Sakshi News home page

ధోనీ, కోహ్లీ ఫిట్‌నెస్‌ రహస్యం ఇదే

Published Thu, Dec 1 2016 10:02 AM | Last Updated on Mon, Sep 4 2017 9:38 PM

ధోనీ, కోహ్లీ ఫిట్‌నెస్‌ రహస్యం ఇదే

ధోనీ, కోహ్లీ ఫిట్‌నెస్‌ రహస్యం ఇదే

ముంబై: టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ, టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. ఇద‍్దరూ విజయానికి మారుపేరు. కెప్టెన్‌గా ధోనీ దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించగా.. కోహ్లీ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. ప్రతిభ, అంకితభావం, నాయకత్వ లక్షణాలు, ఫిటినెస్‌, పాపులారిటీ వంటి విషయాల్లో వీరిద్దరి మధ్య సారూపత్య ఉంది. కాగా ధోనీ, కోహ్లీ వ్యవహార శైలి మాత్రం విభిన్నం. మైదానం లోపల, బయట మహీ మిస్టర్‌ కూల్‌ అయితే.. విరాట్‌​ది దూకుడు స్వభావం. అలాగే డైట్‌లో కూడా వీరిద్దరికి వేర్వేరు అభిరుచులు ఉన్నాయి.

విరాట్‌ ఎక్కువగా సలాడ్స్, చేపలు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే మాంసాహారాన్ని తీసుకుంటాడు. ఇక ఒత్తిడి తగ్గించుకోవడానికి కోహ్లీ జిమ్‌లో కసరత్తులు చేస్తాడు. కాగా ధోనీ ఆహారపు అలవాట్లు సింపుల్‌గా ఉంటాయి. ఎక్కువగా చపాతీలు, దాల్‌, పండ్లు, తృణధాన్యాలు తీసుకుంటాడు. లంచ్‌ లేదా డిన్నర్‌లో మాత్రం చికెన్‌ లాగిస్తాడు. ధోనీ, కోహ్లీ ఫిట్‌నెస్‌ రహస్యం ఇదే. క్రీడాకారులకు ఫిట్‌నెస్‌ ఎంతో ముఖ్యం. ఇందుకోసం ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్తలు తీసుకుంటుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement