
విజృంభిస్తున్న టీమిండియా బౌలర్లు
జింబాబ్వేతో తొలి వన్డేలో భారత యువ బౌలర్లు అదరగొడుతున్నారు.
హరారే: జింబాబ్వేతో తొలి వన్డేలో భారత యువ బౌలర్లు అదరగొడుతున్నారు. జింబాబ్వే పర్యటనకు కొత్తయినా, పెద్దగా అనుభవం లేకపోయినా అద్భుతంగా రాణిస్తున్నారు. శనివారం జరుగుతున్న ఈ మ్యాచ్లో జింబాబ్వే 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. భారత బౌలర్లు బుమ్రా రెండు, బరీందర్ శ్రణ్, ధావల్ కులకర్ణి చెరో వికెట్ తీశారు.
మ్యాచ్ ఆరంభం నుంచి జింబాబ్వే పరుగుల వేట నెమ్మదిగా సాగింది. బరీందర్ శ్రణ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే జింబాబ్వే ఓపెనర్ పీటర్ మూర్ను అవుట్ చేశాడు. కాసేపటి తర్వాత ధావల్ కులకర్ణి.. మసకద్జ (14)ను అవుట్ చేశాడు. అనంతరం బుమ్రా వరుసగా చిబాబా (13), సిబండా(5)ను పెవిలియన్కు పంపాడు. ప్రస్తుతం ఎర్విన్, సికందర్ రాజా బ్యాటింగ్ చేస్తున్నారు.