
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి తీసుకురావాలని ‘లా’ కమిషన్ ప్రతిపాదించింది. అది ప్రజా అధికారమని కమిషన్ స్పష్టం చేసింది. దీని వల్ల క్రికెట్‌లో బీసీసీఐ గుత్తాధిపత్యం తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ‘ప్రజా పరిశీలన పరిధిలోకి తీసుకొస్తే జవాబుదారీతనం పెరుగుతుంది.
ఇలాంటి వాతావరణాన్ని పోత్సహించేందుకు తోడ్పడుతుంది’ అని లా కమిషన్ బుధవారం తెలిపింది. బీసీసీఐని సమాచార హక్కు చట్టం కిందకు తేవాలనుకుంటున్నారా అని 2016 జూలైలో సుప్రీం కోర్టు లా కమిషన్‌ను ప్రశ్నించిన విషయం తెలిసిందే.