ముంబై: భారత్‌తో నాలుగో టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నాలుగో మ్యాచ్‌కు ముంబై వాంఖడే స్టేడియం ఆతిథ్యమిస్తోంది. సిరీస్‌లో టీమిండియా 2-0తో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. ముంబై టెస్టులో గెలిస్తే సిరీస్ భారత్ సొంతమవుతుంది.