
న్యూఢిల్లీ: భారత మిడిలార్డర్‌లో సమస్యగా మారిన నాలుగో స్థానానికి శ్రేయస్ అయ్యర్ సరిగ్గా సరిపోతాడని భారత దిగ్గజ క్రికెటర్, వ్యాఖ్యాత సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డారు. రిషభ్ పంత్‌ను నాలుగో స్థానంలో ఆడించడం కంటే అయ్యర్‌ని ఆడిస్తేనే జట్టుకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని ఆయన విశ్లేషించారు. జట్టు మేనేజ్‌మెంట్ నాలుగో స్థానాన్ని శాశ్వతంగా ఆయ్యర్‌కు కేటాయించాలని గావస్కర్ సూచించారు. ‘ నా దృష్టిలో పంత్ ధోనిలా ఫినిషర్... అతనికి ఐదు లేదా ఆరో స్థానాన్ని కేటాయిస్తే మంచిది. కానీ అయ్యర్ అలా కాదు ఇన్నింగ్స్‌ను నిర్మించగలడు. అందుకోసం అయ్యర్‌కు... భారత్‌ను చాలా కాలం నుంచి వేధిస్తోన్న నాలుగో స్థానాన్ని కేటాయిస్తే మంచిది’ అని గావస్కర్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment