Lieutenant Colonel honorary rank
-
క్లర్క్ నుంచి లెఫ్టినెంట్ స్థాయికి..
నర్సీపట్నం: సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడా యువకుడు. ఆర్మీలో ఉద్యోగం వచ్చిందని సంతృప్తి చెందలేదు. అందులోనే ఉన్నత స్థానానికి వెళ్లాలని నిరంతరం కష్టపడ్డాడు. పోటీ పరీక్షలు రాసి అనుకున్నది సాధించాడు. యువతరానికి ఆదర్శంగా నిలిచాడు. రావికమతం మండలం జెడ్.కొత్తపట్నం పంచాయతీ శివారు గంపవానిపాలేనికి చెందిన విజనగిరి గోవింద్ విజయప్రస్థానమిది. గోవింద్ పుట్టింది పల్లెటూరు అయినప్పటికీ తల్లిదండ్రులు రాజారావు, సత్యవతి ప్రోత్సాహంతో చదువుపై దృష్టి సారించారు. ప్రాథమిక విద్య గంపవానిపాలెం ప్రభుత్వ పాఠశాల, కొత్తకోట జూనియర్ కాలేజీలో ఇంటర్, బీకాం డిగ్రీ నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్తి చేశారు. 2011లో కాకినాడలో నిర్వహించిన ఓపెన్ సెలక్షన్ ర్యాలీలో క్లర్క్‌గా సెలెక్ట్ అయ్యారు. భోపాల్‌లో ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీర్ సెంటర్లో ఏడాదిన్నర శిక్షణ పూర్తి చేసుకుని, అహ్మదాబాద్‌లో విధుల్లో చేరారు. 13 ఏళ్లుగా ఆర్మీలో సేవలు అందిస్తున్నారు. 2023 మార్చిలో ఎస్ఎస్బీ (సర్వీసెస్ సెలక్షన్ బోర్డు) బెంగళూరులో ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలో 152 మంది పోటీ పడగా 8 మంది ఎంపికయ్యారు. ఈ ఎనిమిది మందిలో గోవింద్ ఒకరు. ఆఫీసర్స్ విభాగం క్లాస్‌వన్‌లో స్పెషల్ కమిషన్ ఆఫీసర్ (లెఫ్టినెంట్)గా ఎంపికయ్యారు. బిహార్ రాష్ట్రం గయాలో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. శిక్షణ అనంతరం తల్లిదండ్రులు, భార్య భవాని, పిల్లలతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. ఇండియన్ ఆర్మీలో స్పెషల్ కమిషన్ ఆఫీసర్‌గా రాజస్థాన్‌లో బాధ్యతలు చేపట్టనున్నారు. -
సైనిక లాంఛనాలతో లెఫ్టినెంట్ కల్నల్ అంత్యక్రియలు
సాక్షి, యాదాద్రి/మల్కాజిగిరి/సాక్షి, హైదరాబాద్: అరుణాచల్‌ప్రదేశ్‌లో మూడు రోజుల క్రితం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ్‌భానురెడ్డి (వీవీబీరెడ్డి) అంత్యక్రియలు శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో సైనిక లాంఛనాలతో జరిగాయి. భానురెడ్డి తల్లిదండ్రులు, భార్య, కూతుళ్లు, బంధువులు, గ్రామస్తులు, ఆర్మీ అధికారులు, ప్రజాప్రతినిధులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వినయ్‌భానురెడ్డి తండ్రి నర్సింహారెడ్డి, కూతు రు హనిక.. చితికి నిప్పంటించారు. సైనికులు గాల్లోకి మూ డు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. ఆరీ్మకి చెందిన కల్నల్ మనీశ్ దేవగణ్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. వినయ్ భార్య స్పందనారెడ్డి భారత సైన్యంలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరిలోని వినయ్‌భానురెడ్డి ఇంటి నుంచి ఆయన పార్థివ దేహాన్ని శనివారం ఉదయం సైనిక వాహనంలో స్వగ్రామం బొమ్మలరామారానికి తీసుకువచ్చారు. ప్రముఖుల నివాళి: వినయ్‌భానురెడ్డి పార్థివదేహాన్ని బొమ్మలరామారంలోని ఆయన ఇంటికి తీసుకువచ్చి గంటపాటు ప్రజల సందర్శనార్థం ఉంచారు. అంతకు ముందు మల్కాజిగిరి నివాసంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై, ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే, సదరన్ కమాండ్ జనరల్ ఆఫీస్ కమాండింగ్ చీఫ్ లెఫ్టినెంట్ కల్నల్ ఎ.కె.సింగ్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆయనకు నివాళులర్పిం చారు. బొమ్మలరామారంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, రాచకొండ సీపీ దేవేంద్రసింగ్ చౌహాన్, యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, డీసీపీ రాజేశ్చంద్ర తదితరులు వినయ్‌భానురెడ్డికి నివాళులర్పిం చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం అండగా నిలవాలి: ఎంపీ కోమటిరెడ్డి దేశం కోసం విధులు నిర్వహిస్తూ.. ప్రాణాలు విడిచిన లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ భానురెడ్డి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ. 50 లక్షల ఎగ్స్‌గ్రేషియా ఇవ్వాలని శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. -
ఆర్మీ శిక్షణకు వెళ్లిన ధోనీ
న్యూఢిల్లీ: భారత టి-20, వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆర్మీ శిక్షణకు వెళ్లాడు. గతంలో భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ హోదా పొందిన ధోనీ.. ప్రస్తుతం ఆగ్రాలోని ఎలైట్ పారా రెజిమెంట్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. శిక్షణ తీసుకుంటానంటూ ఇటీవల ధోనీ ఆర్మీ ఉన్నతాధికారులకు లేఖ రాయడంతో వారు అనుమతించారు. ఆగ్రాలోని పారా ట్రైనింగ్ స్కూల్లో ధోనీ రెండు వారాల పాటు శిక్షణ పొందనున్నాడు. ధోనీ శిక్షణ పొందిన తర్వాత ఐదు పారాచూట్ జంప్స్ చేయగలడని రక్షణ శాఖ ప్రతినిధి సీతాన్షు కర్ చెప్పారు. 2011లో భారత సైన్యం గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ హోదాతో ధోనీని గౌరవించిన సంగతి తెలిసిందే. ధోనీకి కమెండో యూనిఫాం కూడా బహూకరించింది.