ధోనీ ఎవరిని కలిశాడో తెలుసా?
చెన్నై: ఒకరు 'నిప్పురా..' అంటూ స్క్రీన్ పై చెలరేగుతారు. ఇంకొకరు 'మిస్టర్ కూల్'గా కనిపిస్తూ మైదానంలో దుమ్మురేపుతారు. ఆ ఇద్దరూ కలిస్తే మాత్రం ఇదిగో ఇలా సాదాసీదాగా సోఫాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. టీమిండియా వన్ డే కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ తన అభిమాన నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలుసుకుని కాసేపు ముచ్చటించారు.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
క్రికెటర్ జీవితకథ ఆధారంగా రూపొందించిన 'ఎమ్మెస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ' ప్రమోషన్ లో భాగంగా గురువారం చెన్నైకి వచ్చిన చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంది. అనంతరం రజనీకాంత్ ను కలుసుకుని ఆశీర్వచనాలు తీసుకుంది. ధోనీతోపాటు సినిమా హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, దర్శకుడు నీరజ్ పాండేలు కూడా రజనీని కలిసినవారిలో ఉన్నారు. ధోనీ సినిమా హిట్ కావాలని సూపర్ స్టార్ మనస్ఫూర్తిగా ఆశ్వీర్వదించారు. సెప్టెంబర్ 30న 'ధోనీ అన్ టోల్డ్ స్టోరీ' విడుదలకానుంది.