'ఇప్పుడు క్రికెట్ ను ప్రేమిస్తున్నా' | Now I love this game of cricket: Neeta Ambani | Sakshi
Sakshi News home page

'ఇప్పుడు క్రికెట్ ను ప్రేమిస్తున్నా'

Published Mon, May 25 2015 9:30 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM

'ఇప్పుడు క్రికెట్ ను ప్రేమిస్తున్నా'

'ఇప్పుడు క్రికెట్ ను ప్రేమిస్తున్నా'

కోల్ కతా: తమ జట్టు ఐపీఎల్-8 విజేతగా నిలవడం పట్ల ముంబై ఇండియన్స్ టీమ్ సహ యజమాని నీతా అంబానీ హర్షం వ్యక్తం చేశారు. తానిప్పుడు క్రికెట్ ను ప్రేమిస్తున్నానని చెప్పారు. ఐపీఎల్ మొదలైనప్పుడు తనకు అసలు క్రికెట్ గురించి తెలియదని వెల్లడించారు. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు.

'మొదటి, రెండు ఐపీఎల్ వరకు క్రికెట్ గురించి అసలు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు క్రికెట్ ను అభిమానిస్తున్నా. మా టీమ్ కు పెద్ద సంఖ్యలో మద్దతుగా నిలిచిన అభిమానులను ఇష్టపడుతున్నా' అని నీతా అంబానీ అన్నారు. వాంఖేడ్ మైదానంలో మొదటి క్వాలిఫయిర్ మ్యాచ్ లో చెన్నైని ఓడించిన తర్వాత తామే విజేతగా నిలుస్తామని నమ్మకం ఏర్పడిందని తెలిపారు. తమ జట్టు సాధించిన విజయాన్ని అభిమానులకు అంకితం చేశారు.

ఈ క్రెడిట్ మొత్తం టీమ్ కే దక్కుతుందని నీతా అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ అన్నారు. 10 మ్యాచుల్లో 9 విజయాలు సాధించడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. టైటిల్ సాధించేందుకు తమ ఆటగాళ్లు చాలా కష్టపడ్డారని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement