టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి గత కొంత కాలంగా అతర్జాతీయ టీ20లకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత వీరిద్దరూ టీమిండియా తరపున టీ20ల్లో కన్పించలేదు. వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో ఓటమి తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ నుంచి కూడా వీరిద్దరూ తప్పుకున్నారు.
దీంతో రోహిత్, కోహ్లి త్వరలోనే అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించనున్నారని తెగ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విరాట్, రోహిత్ వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ వరకు కొనసాగితే బాగుంటుందని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
"టీ20 వరల్డ్‌కప్ జట్టులోకి వచ్చేందుకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరికి ఛాన్స్ ఉంది. వారిద్దరూ ఐపీఎల్‌లో ఎలా ఆడుతారో చూడాలి. ఐపీఎల్‌లో వారు ఆట తీరు చాలా ముఖ్యం. వారిద్దరూ చాలా కాలం నుంచి భారత జట్టుకు తమ సేవలు అందిస్తున్నారు. కాబట్టి వారికి అందుకు తగ్గ గౌరవం ఇవ్వాలి. వాళ్ల ఫామ్ చూసి, వాళ్లకు అవకాశం ఇవ్వాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకోవాలి.
ఇద్దరూ కూడా అద్బుతమైన క్రికెటర్లే. ఐపీఎల్‌లో వీరిద్దరూ మెరుగైన ప్రదర్శన చేస్తే కచ్చితంగా జట్టులో ఉండాలి. ఎందుకంటే ఐపీఎల్ ఫైనల్‌కు టీ20 వరల్డ్‌కప్ ప్రారంభానికి మధ్య పెద్దగా గ్యాప్ ఉండదు. వేచి చూద్దం ఏమి జరుగుతుందో" అని పీటీఈకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీటర్సన్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2024: అతడొక ఫినిషర్.. వేలంలో తీవ్ర పోటీ! రూ.13 కోట్లకు
Comments
Please login to add a commentAdd a comment