‘ఐపీఎల్‌ 2020 విజేత ఎవరో చెప్పేశాడు’ | Pietersen Analysis On Winner Of Thirteen IPL | Sakshi
Sakshi News home page

‘ఐపీఎల్‌ 2020 విజేత ఎవరో చెప్పేశాడు’

Published Sat, Sep 12 2020 7:45 PM | Last Updated on Sat, Sep 19 2020 3:23 PM

Pietersen Analysis On Winner Of Thirteen IPL - Sakshi

దుబాయ్‌: ప్రపంచ క్రికెట్‌ అభిమానులు ఎంతో ఉద్వేగంగా ఎదురు చేస్తున్న ఐపీఎల్‌ 2020పై మాజీ క్రికెటర్లు అనేక విశ్లేషణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్ ఐపీఎల్‌ 2020లో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయో సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. పీటర్సన్ స్పందిస్తూ యూఏఈలో సెప్టెంబర్‌ 19న ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 2020 ఎంతో ఉత్కంఠగా సాగనుందని తెలిపాడు. కాగా ఐపీఎల్‌ 2020లో  ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజేతగా నిలిచే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఇటీవల ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా  టి 20 సిరీస్‌లో వ్యాఖ్యాత(కామంటేటర్‌గా) బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌ పూర్తయినందున ఐపీఎల్‌ను వీక్షిస్తానని తెలిపాడు.

తనకు క్రికెట్‌ అంటే విపరీతమైన ఇష్టమని, ఆసక్తికర మ్యాచ్‌లను ఆస్వాధిస్తానని పీటర్సన్ తెలిపాడు. అయితే పీటర్సన్‌ గత ఐపీఎల్‌లలో రాయల్‌ చాలెంజర్స్ బెంగుళూరు, ఢిల్లీ డేర్‌ డెవిల్స్ తరపున ఆడాడు. అయితే దక్షిణాఫ్రికా సంతతికి చెందిన కెవిన్ పీటర్సన్‌ ఇంగ్లండ్‌ తరఫున ప్రాతినిధ్యం వ‌హించాడు. కాగా 104 టెస్టుల్లో 8,181 పరుగులు, 136 వన్డేల్లో 4,440 పరుగులు, 37 టీ20ల్లో 1176 ప‌రుగులు చేశాడు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాక పీటర్సన్‌ వ్యాఖ్యాతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. (చదవండి: మాకు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండేది కాదు..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement