లండన్ : ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని ప్రశంసలతో ముంచెత్తాడు. కోహ్లి ఎంతో గొప్ప ఆటగాడిగా తయారవుతాడనేది తాను ముందే ఊహించినట్లు పేర్కొన్నాడు. 2009లో జరిగిన ఐపీఎల్ 2వ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుకు కెవిన్ పీటర్సన్ నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. అప్పుడు టీంలో యంగ్‌ప్లేయర్స్‌గా ఉన్న ఆటగాళ్లలో కోహ్లి ఒకడిగా ఉన్నాడు. (చివరి రోజు మ్యాచ్.. ప్రేక్షకులు లేకుండానే!)
పీటర్సన్ మాట్లాడుతూ.. '2009 ఐపీఎల్ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించా. మ్యాచ్‌లు ఆడడానికి బస్సులో వెళ్లే సమయంలో, అలాగే ప్రాక్టీస్ సమయంలోనూ నా దగ్గర ఎన్నో బ్యాటింగ్ సలహాలు తీసుకున్నాడు. ఆ సమయంలో అతను ఆటను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు. ఒక ఉత్తమ ఆటగానిగా తయారవ్వాలనే సంకల్పమే కోహ్లిని ఈరోజు ఉన్నత స్థానంలో నిలబెట్టింది. 2009 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ నాకు ఇంకా గుర్తుంది. ఆ మ్యాచ్‌లో కోహ్లి నన్ను రనౌట్ చేశాడు. కానీ నేను ఏమి అనకుండా మైదానంలో అతన్ని స్వేచ్చగా వదిలిపెట్టాను. ఒక యంగ్ ప్లేయర్‌గా జట్టును గెలిపించాలనే భావంతో మ్యాచ్ చివరి వరకు తన వికెట్ ఇవ్వకుండా జట్టును గెలిపించాడు. తన కంటే ఎంతో సీనియర్ ఆటగాడిగా ఆ సమయంలో అతన్ని ఏమి అనలేదు. కానీ ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను.. అప్పట్లో కోహ్లిని ఒక యంగ్ ప్లేయర్‌గా చూస్తూనే అతని కెరీర్ ఆరంభంలో నా వంతుగా సలహాలు, సూచనలు చేశాను. ఇప్పటికి మా మధ్య నమ్మకమైన స్నేహం మాత్రమే ఉంటుందని నేను నమ్ముతున్నా' అంటూ తెలిపాడు. ('ప్రపంచకప్ గెలిచే సత్తా ఆ మూడు జట్లకే ఉంది')
ఇక విరాట్ కోహ్లి విషయానికి వస్తే 2011 నుంచి ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో అత్యదిక పరుగులు చేసిన రికార్డుతో పాటు ఐపీఎల్‌లో ఐదు సెంచరీలు చేసిన రెండో ఆటగానిగా గుర్తింపు పొందాడు. కాగా మొదటి స్థానంలో ఆరు సెంచరీలతో విండీస్ ఆటగాడు క్రిస్ గేల్ కొనసాగుతున్నాడు. కాగా కరోనా ప్రభావంతో ఐపీఎల్ 13వ సీజన్ నిర్వహించాలా వద్దా అనేదానిపై మార్యి 14(శనివారం) ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కానుంది. (ట్రంప్‌ను ట్రోల్ చేసిన పీటర్సన్, ఐసీసీ)
Comments
Please login to add a commentAdd a comment