
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై నిర్లక్ష్యం తగదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హితవు పలికిన సంగతి తెలిసిందే. వైరస్ సోకకుండా, వ్యాప్తి చెందకుండా ప్రజలంతా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వాల సూచనలను తు.చ తప్పకుండా పాటించాలని కోరారు. దీనిలో భాగంగా ఆదివారం(మార్చి 22) ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలకు ఎవరూ బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు.
దీనిలో భాగంగా ‘జనతా కర్ఫ్యూ’కు అందరూ సహకరించాలని కోరారు. దీనిపై పలువురు క్రికెటర్లు స్పందించారు. మోదీ పిలుపుతో కరోనా వైరస్‌పై పోరాటం చేద్దామని మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కూడా గళం కలిపాడు. ‘నమస్తే ఇండియా.. అంతా ఒక్కటై కరోనాపై పోరాటం చేద్దాం. ఇంట్లో ఉండి స్వీయ నిర్భందం పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును పాటిద్దాం’ అని పీటర్సన్ ట్వీట్ చేశాడు. దీనికి బదులుగా మోదీ స్పందించారు. ‘ఎన్నో ఒడిదుడికులు ఎదుర్కొని ఎన్నో జట్లను చూసిన విధ్వంసకర బ్యాట్స్‌మన్ పీటర్సన్.. మనకోసం స్పందించాడు. మనమంతా కోవిడ్-19పై పోరాటం చేద్దాం’ అని మోదీ జవాబిచ్చారు.
మీ నాయకత్వం కూడా విధ్వంసమే కదా
ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌కు పీటర్సన్ తిరిగి బదులిచ్చాడు. ‘థాంక్యూ మోదీ జీ.. మీ నాయకత్వం కూడా విధ్వంసమే కదా’ అని హిందీలో ట్వీట్ చేశాడు. తొలుత ట్వీట్ చేసిన కూడా పీటర్సన్ హిందీలోనే పోస్ట్ చేయగా, ఆ తర్వాత కూడా హిందీలోనే రిప్లే ఇవ్వడం విశేషం. కాగా, ఇంగ్లిష్ బ్యాట్స్‌మన్ అయిన పీటర్సన్‌కు మోదీ ఇంగ్లిష్‌లో ట్వీట్ చేస్తే, పీటర్సన్ మాత్రం హిందీలోనే అందుకు సమాధానం చెప్పడం ఆసక్తిగా మారింది. (మహ్మద్ కైఫ్ ట్వీట్‌పై మోదీ ఇలా..)
Shukriya Modi ji , aapki leadership bhi kaafi bispotak hai 🙏🏻
— Kevin Pietersen🦏 (@KP24) March 20, 2020