దక్షిణాఫ్రికా జట్టుకు ఆడాలని ఉంది:పీటర్సన్ | Kevin Pietersen open to international return via SA | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా జట్టుకు ఆడాలని ఉంది:పీటర్సన్

Published Sun, Apr 10 2016 8:45 PM | Last Updated on Sun, Sep 3 2017 9:38 PM

దక్షిణాఫ్రికా జట్టుకు ఆడాలని ఉంది:పీటర్సన్

దక్షిణాఫ్రికా జట్టుకు ఆడాలని ఉంది:పీటర్సన్

ముంబై: ఇంగ్లండ్ మాజీ  కెప్టెన్ కెవిన్ పీటర్సన్ మనసు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ వైపుకు మళ్లింది. తన క్రికెట్ పునరాగమనానికి దక్షిణాఫ్రికా జట్టు ఒక అవకాశంగా ఉందని పీటర్సన్ తాజాగా వెల్లడించాడు. 'దక్షిణాఫ్రికా జట్టుకు ఆడాలనే ఆలోచన నాలో పుట్టింది. అలా వెళ్లాలనుకుంటే 2018 వరకూ ఆగాల్సిందే. అప్పుడే మాత్రమే నాకు ఆ అర్హత వస్తుంది. అది జరగాలని ఉంటే జరుగుతుంది. లేకపోతే లేదు. అంతర్జాతీయ క్రికెట్ అంటేనే సమ్ థింగ్ స్పెషల్. సుదీర్ఘకాలం క్రికెట్ ఆడిన అనుభవం నాకు ఉంది. దక్షిణాఫ్రికా జట్టులో ఆడే అవకాస్తే మాత్రం దానికి ఇంకా ఏడాది దూరం ఉంది. ఆలోపు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం' అని సూచనప్రాయంగా పీటర్సన్ తన మనసులో మాటను వెల్లడించాడు.


స్వతహాగా దక్షిణాఫ్రికాలో జన్మించిన పీటర్సన్..  2004లో ఇంగ్లండ్కు వచ్చి క్రికెట్ కెరీర్ ను ఆరంభించాడు. దాదాపు 10 ఏళ్లు పాటు ఇంగ్లండ్ జట్టులో కొనసాగాడు. అయితే 2013-14 యాషెస్ సిరీస్ అనంతరం పీటర్సన్కు ఈసీబీ ఉద్వాసన పలికింది. దీంతో ఈసీబీ నిర్ణయాన్ని స్వాగతించిన పీటర్సన్ తాను ఇక ఆడలేనంటూ ప్రకటించాడు. ఇంగ్లండ్ తరపున 104 టెస్టులో ఆడిన పీటర్సన్ 23 సెంచరీల సాయంతో 8,881 పరుగులు నమోదు చేశాడు. టెస్టులో అతని యావరేజ్ 47.28 ఉండటం విశేషం. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మహేంద్ర సింగ్ ధోని ప్రాతినిధ్యం వహిస్తున్న పుణె సూపర్ జెయింట్స్ లో పీటర్సన్ ఆడుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement