ఇంగ్లండ్ క్రికెటర్ పీటర్సన్ అరెస్ట్
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌ను ఎయిర్‌పోర్టు పోలీసులు ఒకే రోజు రెండు సార్లు అరెస్టు చేశారు.
లండన్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌ను ఎయిర్‌పోర్టు పోలీసులు ఒకే రోజు రెండు సార్లు అరెస్టు చేశారు. ఒకసారి జెనీవా మరోసారి లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా పీటర్సన్‌కు ఇష్టమైన గోల్ఫ్ ఆటనే అతడిని అరెస్టు చేయించింది. ఎయిర్‌పోర్టు నిబంధనలకు విరుద్దంగా పీటర్సన్ గోల్ఫ్ బంతిని ముందుకు ఊపారు. దీంతో జెనీవా పోలీసులు అరెస్టు చేసి అతడిని కొద్దీసేపు సెల్‌లో ఉంచారు.
ఇంత జరిగినా మారని పీటర్సన్ హీత్రూ ఎయిర్‌పోర్టులో మళ్లీ గోల్ఫ్ బంతిని ఊపారు. దీంతో పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకుని సెల్‌లో వేశారు. ఈ విషయాన్నిపీటర్సనే స్వయంగా తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ఈ మధ్యే అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్ అనంతరం పీటర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు.