భారత్లో ఆ రెండు గ్రౌండ్స్ వరస్ట్:పీటర్సన్ | Indian grounds among worst in the world, says Kevin Pietersen | Sakshi
Sakshi News home page

భారత్లో ఆ రెండు గ్రౌండ్స్ వరస్ట్:పీటర్సన్

Published Mon, Jun 6 2016 7:18 PM | Last Updated on Mon, Sep 4 2017 1:50 AM

భారత్లో ఆ రెండు గ్రౌండ్స్ వరస్ట్:పీటర్సన్

భారత్లో ఆ రెండు గ్రౌండ్స్ వరస్ట్:పీటర్సన్

ప్రపంచంలో తనకు నచ్చని స్టేడియాల్లో భారత్ లో కూడా రెండు ఉన్నాయని ఇంగ్లండ్ క్రికెటర్ పీటర్సన్ స్పష్టం చేశాడు.

లండన్: ప్రపంచంలో తనకు నచ్చని స్టేడియాల్లో భారత్ లో కూడా రెండు ఉన్నాయని ఇంగ్లండ్ క్రికెటర్ పీటర్సన్ స్పష్టం చేశాడు. కాన్పూర్లో ఉన్న గ్రీన్ పార్క్ స్టేడియంతో పాటు, అహ్మదాబాద్లో ఉన్న మోతేరా గ్రౌండ్స్ లు ప్రపంచంలోనే అత్యంత చెత్త గ్రౌండ్స్ అని వ్యాఖ్యానించాడు. తన గత కొన్ని సంవత్సరాల పరిశీలనలో భారత్లోని ఆ రెండు గ్రౌండ్స్ అత్యంత దారుణంగా ఉంటాయన్నాడు.

 

ప్రపంచంలోని క్రికెట్ స్టేడియాలపై ట్విట్టర్లో ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నకు పీటర్సన్ స్పందించాడు. వీటితో పాటు గయానా గ్రౌండ్, మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్డ్ , చెల్మ్స్ ఫోర్డ్, కాల్విన్ బే, కాన్ బెర్రా, ముల్తాన్, లీసెస్టర్, సెయింట్ కిట్స్ గ్రౌండ్స్ కూడా దారుణంగా ఉంటాయన్నాడు. అయితే ప్రపంచ అత్యుత్తమ గ్రౌండ్లలో ముంబైలోని వాంఖేడి స్టేడియం ఒకటని పీటర్సన్ పేర్కొన్నాడు. ముంబైతో పాటు అడిలైడ్, ద ఓవల్, ట్రినిడాడ్, ఎంసీజీ, కింగ్స్మెడ్, హెడింగ్లీ, సెంచూరియన్, వెల్లింగ్టన్, బార్బాడాస్లు తనకిష్టమైన వేదికలన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement