హైదరాబాద్: రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం అహ్మదాబాద్‌లోని కొత్తగా నిర్మించిన మొతెరా స్టేడియంలో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో భాగంగా లక్షకు పైగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో భారతీయ పేర్లు, పండగలు, సినిమాల గురించి ప్రస్తావించారు. అయితే ఆ పేర్లను పలకడంలో తడబడ్డారు. ఈ క్రమంలో చాయ్ వాలాను చీవాలా అని, వేదాలను వేస్టాస్ అని, స్వామి వివేకానంద పేరును వివేకముందగా అని పేర్కొన్నారు. అదేవిధంగా భారత క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిల గురించి ప్రస్తావించారు. అయితే వారి పేర్లను ఉచ్చరించడంలో ట్రంప్ విఫలమయ్యారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ట్రంప్‌ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
ట్రంప్ నోటి నుంచి టీమిండియా దిగ్గజాల పేర్లు రావడం పట్ల పలువురు నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ ఇద్దరి పేర్లను సుచిన్ టెండూల్కర్, విరాట్ కోలీ అని ఉచ్చరించడం పట్ల క్రికెట్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ఇంగ్లండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్ కూడా ట్రంప్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. లెజెండ్స్ పేర్లను పలికేముందు ట్రంప్ తగిన రీసెర్స్ చేయాలని ట్రంప్‌కు పీటర్సన్ సూచించాడు. ఐసీసీ కూడా ట్రంప్‌ను ట్రోల్ చేసింది. ‘sach, such, satch, sutch, sooch లాంటి పేర్లు ఎవరికైనా తెలుసా?’అని అభిమానులను ఐసీసీ ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
FFS, @piersmorgan, pls ask your mate to do some research in pronouncing legends names?! https://t.co/eUGuCNReaM
— Kevin Pietersen🦏 (@KP24) February 24, 2020
Sach-
— ICC (@ICC) February 24, 2020
Such-
Satch-
Sutch-
Sooch-
Anyone know? pic.twitter.com/nkD1ynQXmF
చదవండి:
తెల్లని దుస్తుల్లో రాజహంసలా..
ట్రంప్‌తో తేల్చుకోవాల్సినవి...
హోలీ టు షోలే.. లవ్యూ ఇండియా
Comments
Please login to add a commentAdd a comment