
డేర్‌డెవిల్స్‌కు షాక్
తొలి మ్యాచ్‌కు పీటర్సన్ దూరం
దుబాయ్: ఐపీఎల్‌లో తమ తొలి మ్యాచ్‌కు ముందే ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు పెద్ద షాక్ తగిలింది. చేతి వేలికి గాయం కారణంగా కెప్టెన్ పీటర్సన్ బెంగళూరుతో గురువారం జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. దినేశ్ కార్తీక్ ఢిల్లీ జట్టుకు సారథ్యం వహిస్తాడు. పీటర్సన్ గాయం తీవ్రత, ఎప్పుడు అందుబాటులో ఉంటాడనే విషయంలో స్పష్టత లేదు.