లండన్: కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచం మొత్తం దాదాపు లాక్‌డౌన్ అయిన నేపథ్యంలో అంతా తమ తమ ఇళ్లలోనే కాలక్షేపం చేస్తున్నారు. ఇక్కడ తమ అభిరుచులను ఏమాత్రం మిస్ కాకుండా లాక్‌డౌన్‌ను ఆస్వాదిస్తున్నారు. దీనిలో భాగంగా ఒక వ్యక్తి క్రికెట్‌ను ఎంజాయ్ చేసిన విధానం నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసి లాక్‌డౌన్‌లో ఉన్న క్రికెట్ అభిమానులకు మరింత వినోదాన్ని తీసుకొచ్చాడు.
ఇంతకీ ఏమిటంటే.. ఒక వ్యక్తి క్రికెట్ ప్రాక్టీస్‌ను ఇంట్లోనే మొదలుపెట్టేశాడు. క్రికెట్ మ్యాచ్‌కు ఏ విధంగా సన్నద్ధం అవుతామో.. అదే తరహాలో పూర్తి క్రికెట్ కిట్‌తో అంటే ఒంటి మీద క్రికెటర్లు వేసుకునే ప్రత్యేకమైన డ్రెస్స్, తలకు హెల్మెట్, చేతికి గ్లౌజ్ వేసుకుని ఇంట్లో ప్రాక్టీస్ చేస్తాడు. అది కూడా ఒక ఇరుకు సందులో షాట్ ఆడతాడు. అంతే వెంటనే పరుగు తీయడానికి మాత్రం పక్కనే ఉన్న ట్రెడ్‌మిల్ ఎక్కేస్తాడు. ఇది చూస్తే ఇలా కూడా క్రికెట్ ప్రాక్టీస్ చేయొచ్చా అనిపిస్తోంది. ఏది ఏమైనా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పీటర్సన్ పోస్ట్ చేసిన ఈ తాజా వీడియో మాత్రం ఫన్నీగా ఉంది. (డివిలియర్స్‌ను స్లెడ్జింగ్ చేయలేదు!)
Comments
Please login to add a commentAdd a comment