హోబర్ట్: మాజీ దిగ్గజ క్రికెటర్లు షేన్ వార్న్, కెవిన్ పీటర్సన్, మైఖేల్ స్లేటర్‌లకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా వేశారు. ఆస్ట్రేలియాలో మాజీ క్రికెటర్లు కారు రైడింగ్‌కు వెళ్లినపుడు సీటు బెల్ట్ పెట్టుకోనందుకు పోలీసులు దాదాపు 20,500 రూపాయల జరిమానా విధించారు. షేన్ వార్న్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో ఈ ముగ్గురూ ట్రాఫిక్ రూల్స్ పాటించనట్టు తేలింది.
ఆస్ట్రేలియాలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు వార్న్, పీటర్సన్, స్లేటర్‌లు కామెంటేటర్లుగా పనిచేస్తున్నారు. ఆసీస్ మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ కారులో మాజీ కీపర్ ఇయాన్ హేలీతో కలసి వీరు ముగ్గురు రైడింగ్‌కు వెళ్లారు. రెండో టెస్టు మూడో రోజు ఆట అనంతరం ఈ వీడియోను వార్న్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. 4 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో మార్క్ టేలర్ కారు డ్రైవింగ్ చేస్తున్నట్టు కనిపించగా, ముందు సీట్లో అతని పక్కన హేలీ కూర్చున్నాడు. వీరిద్దరూ సీటు బెల్టులు ధరించగా, కారు వెనుక సీట్లో కూర్చున్న వార్న్, పీటర్సన్, స్లేటర్‌లు సీటు బెల్ట్ పెట్టుకోలేదు. ఈ వీడియో ఫేస్‌బుక్‌లో వైరల్ కావడంతో తస్మేనియన్ పోలీసులు మంగళవారం ఈ విషయాన్ని గుర్తించారు. టేలర్, హేలీలను మినహాయించి, నిబంధనలను ఉల్లంఘించిన వార్న్, పీటర్సన్, స్లేటర్‌లకు జరిమానా వేశారు.
వీడియో పోస్ట్ చేసి.. షేన్ వార్న్ బుక్కయ్యాడు
Published Tue, Nov 22 2016 7:11 PM | Last Updated on Tue, Oct 2 2018 4:26 PM
Advertisement
Advertisement