Michael Slater
-
బెయిల్ నిరాకరణ.. కోర్టులో కూప్పకూలిన ఆసీస్ మాజీ ఓపెనర్
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ ఓపెనర్ మైఖేల్ స్లేటర్ వివాదంలో చిక్కుకున్నాడు. భార్యపై గృహ హింసకు పాల్పడడం, మహిళల్ని వెంబడించడం, దొంగతనానికి పాల్పడడం వంటి కేసుల్లో భాగంగా స్లేటర్‌ను క్వీన్స్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై ఏకంగా 19 కేసులు నమోదయ్యాయి. 2023 డిసెంబర్ 5 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీ మధ్యలో అతను ఈ నేరాలకు పాల్పడినట్లు కేసులు రిజిష్టర్ అయ్యాయి. అయితే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న మైఖేల్ స్లేటర్‌కు క్వీన్స్లాండ్ మేజిస్ట్రేట్ కోర్టు షాకిచ్చింది. అతడి బెయిల్ ధరఖాస్తును కోర్టు తిరస్కరించింది. అతడికి కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసుపై తదుపరి విచారణను మే 31కు కోర్టు వాయిదా వేసింది. ఈ విషయం తెలిసిన స్లేటర్ కోర్టు ఆవరణలోనే కుప్పకూలిపోయాడు. కరెక్షనల్ సర్వీసెస్ సిబ్బంది అతడిని తన సెల్‌కు తీసుకు వెళ్తుండగా స్లేటర్ ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆస్ట్రేలియన్ మీడియా తమ కథనాల్లో పేర్కొంది. అదేవిధంగా స్లేటర్ ప్రస్తుతం మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా గతంలో పలుమార్లు కోర్టు ఆదేశాలను స్లేటర్ ధిక్కరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడికి బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆస్ట్రేలియా తరపున 74 టెస్టులు, 42 వన్డేలు ఆడిన స్లేటర్ 42.83 సగటుతో 5,312 పరుగులు సాధించాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్లేటర్ ఆ తర్వాత టీవీ కామెంటేటర్‌గా రాణించాడు. ఛానెల్ 9, ఛానల్ 7లలో పనిచేశారు. -
మాజీ క్రికెటర్‌కు కోర్టులో ఊరట.. మెంటల్ హెల్త్ ఆస్పత్రికి తరలింపు!
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకెల్ స్లేటర్‌ను మెంటల్ హెల్త్ ఆసుపత్రికి తరలించారు. మానసిక పరిస్థితి సరిగా లేనందున అతనిపై ఉన్న గృహహింస కేసును కొట్టేస్తున్నట్లు సిడ్నీ లోకల్ కోర్టు తెలిపింది. విషయంలోకి వెళితే.. 52 ఏళ్ల మైకెల్ స్లేటర్‌పై గతేడాది అక్టోబర్‌లో న్యూసౌత్ వేల్స్ పోలీసులు గృహహింస కేసు నమోదు చేశారు. ఇక తన మాజీ భార్యకు ఫోన్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపించడంతో పాటు మానసిక వేధింపులకు గురి చేశాడనే ఆరోపణలు రావడంతో గత డిసెంబర్లో అధికారులు అతనిపై మరిన్ని కేసులు నమోదు చేశారు. అయితే అతని మానసికస్థితి సరిగా లేనందునే ఇలా ప్రవర్తిస్తున్నాడని ఫిబ్రవరిలో అతని తరపు లాయర్ కోర్టుకు తెలిపాడు. తాజాగా మరోసారి మైకెల్ స్లేటర్ కేసు వాదనకు వచ్చింది. కేసును విచారించిన మెజిస్ట్రేట్ రాస్ హడ్సన్ అతని పరిస్థితిపై స్పందించాడు. ''మైకెల్ స్లేటర్ మానసిక పరిస్థితి బాగా లేదని.. ప్రస్తుతం జైలు కంటే రీహాబిలిటేషన్ సెంటర్‌కు పంపించాల్సిన అవసరం ఉంది. మూడు వారాల పాటు మెంటల్ హెల్త్ యూనిట్లో స్లేటర్ చికిత్స తీసుకోనున్నాడు. తక్షణమే అతన్ని మెంటల్ హెల్త్ యూనిట్‌కు తరలించే ఏర్పాట్లు చేయాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. కాగా మైకెల్ స్లేటర్ అంతకముందే దాదాపు వంద రోజులపాటు ఆల్కహాల్, మెంటల్ డిజార్డర్‌తో బాధపడుతూ రీహాబిటేషన్ సెంటర్లో చికిత్స తీసుకున్నట్లు తేలింది. ఇక 1993-2001 కాలంలో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన మైకెల్ స్లేటర్ 74 టెస్టులు, 42 వన్డేలు ఆడాడు. కాగా 74 టెస్టుల్లో 5312 పరుగులు, 42 వన్డేల్లో 987 పరుగులు సాధించాడు. ఆటకు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత మైకెల్ స్లేటర్ కామెంటేటర్ అవతారం ఎత్తాడు. చదవండి: Yuvraj Singh: టీమిండియా టెస్ట్ కెప్టెన్సీకి అతడే సరైనోడు..! IPL 2022: ఫెర్గూసన్‌కు చుక్కలు చూపించాడు.. ఎవరీ శశాంక్ సింగ్? -
Michael Slater: గృహహింస ఆరోపణలు.. మాజీ క్రికెటర్ అరెస్టు
Ex-Cricketer Michael Slater Arrested: గృహహింస ఆరోపణల నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ స్లాటర్ అరెస్టైనట్లు సమాచారం. సిడ్నీలోని మాన్లీలో గల తన నివాసంలో స్లాటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం జరిగిన ఓ ఘటన ఆధారంగా అందిన ఫిర్యాదు మేరకు అతడిని అరెస్టు చేసినట్లు న్యూసౌత్ వేల్స్ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు... ‘‘అక్టోబరు 12న... గృహహింస ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈస్టర్న్ సబర్బ్స్ పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తు ఆధారంగా బుధవారం ఉదయం 9 గంటల 20 నిమిషాలకు అతడిని అరెస్టు చేశాం’’అని ప్రకటన విడుదల చేశారు. అయితే, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించిన మైకేల్ స్లాటర్.. టెస్టు బ్యాటింగ్ టాపార్డర్‌లో చోటు దక్కించుకున్నాడు. కెరీర్లో మొత్తంగా 5312 పరుగులు చేసిన స్లాటర్.. 2004లో ఆటకు వీడ్కోలు పలికాడు. బ్రాడ్‌కాస్టర్‌గా, టెలివిజన్ పండిట్‌గా గుర్తింపు సంపాదించాడు. చదవండి: T20 World cup 2021: ధోనికి వయస్సు అయిపోలేదు.. మాకు పోటీ ఇవ్వగలడు: కేఎల్ రాహుల్ -
స్లేటర్‌తో ఘర్షణపై వార్నర్ క్లారిటీ
మాలె: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఆ దేశ మాజీ క్రికెటర్, కామెంటేటర్ మైకేల్ స్లేటర్లో ఇటీవల మాల్దీవ్స్‌లోని ఓ బార్లో కొట్టుకున్నట్లు వచ్చిన వార్త హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం ఈ వార్త కు సంబంధించి ఈ ఇద్దరు ఆస్ట్రేలియన్లు వివరణ ఇచ్చారు. కరోనా విజృంభిస్తున్న కారణంగా భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లడంపై ఆ దేశ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ వాయిదా పడడంతో ఆసీస్ క్రికెటర్లు, సిబ్బంది మాల్దీవ్స్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. వాళ్లు అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు పయనమయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మేము గొడవ పడలేదు.. ఇది ఇలా ఉండగా మాల్దీవ్స్‌లోని ఓ బార్లో వార్నర్, స్లేటర్ గొడవపడినట్లు ద డైలీ టెలిగ్రాఫ్ ఓ స్టోరీ రాసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉన్న తాజ్ కోరల్ రిసార్ట్‌లోనే ఈ ఘటన జరిగినట్లు చెప్పింది. ఈ వార్త పై స్లేటర్, వార్నర్ స్పందించారు చెప్పారు. దీనిపై మొదటగా స్పందించిన స్లేటర్ సీనియర్ జర్నలిస్ట్ ఫిల్ రోత్‌ఫీల్డ్‌కు చేసిన మెసేజ్‌లో.. నేను, వార్నర్ ఎప్పటి నుంచో మంచి స్నేహితులం. మా మధ్య గొడవ జరిగే అవకాశమే లేదు. ఇదంతా పుకారే అని స్పష్టం చేశాడు. ఆ తర్వాత వార్నర్ కూడా తన వివరణగా.. మీకు ఇలాంటి పుకార్లు ఎక్కడి నుంచి వస్తాయో నాకు తెలియడం లేదు. ఇటువంటి వార్తలు రాసే ముందు బలమైన ఆధారాలు ఉంటేనే రాయాలంటూ తెలిపాడు. కాగా గత వారం ఆస్ట్రేలియా ప్రధానిపై తీవ్రంగా మండిపడిన స్లేటర్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. భారత్ నుంచి వచ్చే ఆస్ట్రేలియన్లపై నిషేధం విధించడంపై స్లేటర్ తీవ్రంగా మండిపడ్డాడు. ( చదవండి: కేకేఆర్ జట్టులో మరో ఆటగాడికి కరోనా ) -
'ప్రైవేట్ జెట్‌లో వెళ్లి అక్కడి వీధుల్లో శవాలను చూడండి'
సిడ్నీ: ఆసీస్ మాజీ క్రికెటర్ మైకెల్ స్లేటర్ ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్‌పై మరోసారి విరుచుకుపడ్డాడు. కరోనా విజృంభణతో భారత్ అల్లాడిపోతుంటే.. ఐపీఎల్ రద్దుతో అక్కడే ఉండిపోయిన ఆసీస్ ఆటగాళ్లను వెనక్కి రప్పించే విషయంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ ట్విటర్లో వరుస ట్వీట్లు చేశారు.'మానవ సంక్షోభం వంటి అంశంపై ఒక దేశ ప్రధానికి చెప్పాల్సి రావడం ఆశ్చర్యంగా ఉంది. భారత్‌లో ఉన్న ప్రతీ ఆస్ట్రేలియన్ భయంలో ఉన్నారన్నది నిజం. నువ్వు నీ ప్రైవేట్ జెట్‌లో వెళ్లి అక్కడి వీధుల్లో ఉన్న శవాలను చూడండి. ఈ విషయంలో మీతో డిబేట్ చేసేందుకు ఎప్పుడు రెడీగా ఉంటాను' అంటూ విరుచుకుపడ్డాడు. మరోవైపు కరోనాతో పోరాడుతున్న భారతీయులకు సంఘీభావం తెలుపుతూ మరో ట్వీట్ చేశాడు. ''కరోనాపై మీరు చేస్తున్న పోరాటం మాటల్లో వర్ణించలేనిది. కరోనా బారీన పడిన ప్రతీ భారతీయుడు క్షేమంగా కోలుకోవాలంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. ఐపీఎల్లో కామెంటేటర్‌గా పనిచేసినన్నాళ్లు మీరు చూపిన ప్రేమ అద్భుతంగా కనిపించింది.దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి'' అంటూ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ 14వ సీజన్లో కామెంటేటర్‌గా పనిచేసిన మైకెల్ స్లేటర్ కరోనా విజృంభణ దృశ్యా సొంత దేశానికి పయనమయ్యాడు. అయితే ఆస్ట్రేలియా భారత్ నుంచి వచ్చేవారిపై మే 15 వరకు నిషేధం విధించింది. దీంతో ప్రస్తుతం మాల్దీవ్స్‌లో ఉన్న ఆయన అక్కడి నుంచి ఆసీస్ వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఐపీఎల్‌కు కరోనా సెగ తగిలి రద్దు కావడంతో లీగ్‌లో ఆడుతున్న ఆసీస్ క్రికెటర్లు కూడా డైరెక్ట్‌గా ఆస్ట్రేలియా వెళ్లే అవకాశం లేకపోవడంతో శ్రీలంక మీదుగా మాల్దీవ్స్ చేరుకొని అక్కడినుంచి ఆస్ట్రేలియా చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చదవండి: ఐపీఎల్ 2021: ఆసీస్ క్రికెటర్లకు షాక్ Amazing to smoke out the PM on a matter that is a human crisis. The panic, the fear of every Australian in India is real!! How about you take your private jet and come and witness dead bodies on the street! — Michael Slater (@mj_slats) May 5, 2021 I challenge you to a debate anytime PM. — Michael Slater (@mj_slats) May 5, 2021 Above all my love and prayers to every Indian. You have been nothing but amazing to me every time I've been there. Please stay safe. Xx — Michael Slater (@mj_slats) May 5, 2021 -
మీకెంత ధైర్యం.. మమ్మల్ని వదిలేస్తారా?
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-14 సీజన్‌కు వచ్చిన ఆసీస్ క్రికెటర్లు స్వదేశానికి తిరిగి వెళ్లిపోదామని ప్రయత్నాలకు విమానాల నిషేధం రూపంలో అడ్డుతగిలింది. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్.. భారత విమానాల రాకపోకలపై నిషేధం విధించిన నేపథ్యంలో ఐపీఎల్లో చిక్కుకుపోయిన ఆ దేశ క్రీడాకారుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత ప్రతీ ఒక్కర్నీ తమ తమ దేశాలకు పంపుతామని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) హామీ ఇచ్చినా అప్పుడుదాకా ఉండటం వారికి కష్టంగా పరిగణించింది. కొన్ని రోజుల క్రితం స్వదేశానికి రావడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం చార్టెడ్ విమానాలు వేయాలని క్రిస్ లిన్ కోరగా దాన్ని పీఎం మోరిసన్ తిరస్కరించారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక విమానాలు వేయమని, మీరే సొంత ఖర్చులు పెట్టుకుని రావాలని కరాఖండిగా చెప్పేశారు. దీనిపై తాజాగా ఆసీస్ మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ మైకేల్ స్లేటర్ ధ్వజమెత్తాడు. ఇలా మీ దేశ పౌరుల్ని వదిలేస్తారా.. మీకెంత ధైర్యం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈమేరకు ట్వీటర్ ద్వారా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పటికే ఐపీఎల్ బయోబబుల్‌ను వీడి మాల్దీవులకు చెక్కేసిన స్లేటర్.. ఆస్ట్రేలియాకు వెళ్లిపోవడానికి యత్నాలు చేస్తున్నాడు. దీనిలో భాగంగా తమ ప్రధాని మోరిసన్ కామెంట్లపై విరుచుకుపడ్డాడు స్లేటర్. ‘ మీరు మమ్మల్ని స్వదేశానికి రప్పించే చర్యలు చేపట్టకపోతే అంతకంటే దారుణం ఇంకొటి ఉండదు. మాకు ఏది జరిగినా దానికి మీరే కారణం అవుతారు. మమ్మల్ని చిన్నచూపు చూడటానికి మీకెంత ధైర్యం. క్వారంటైన్ సిస్టమ్‌ను ఎలా పరిష్కరిస్తారు. నేను గవర్నమెంట్ అనుమతితోనే ఐపీఎల్లో పని చేయడానికి ఇక్కడికి వచ్చా. కానీ గవర్నమెంట్ నిర్లక్ష్యానికి గురవుతున్నా’ అంటూ ట్వీటర్ వేదికగా స్లేటర్ మండిపడ్డాడు. క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో నిక్ హ్యాక్లీ కూడా ఐపీఎల్లో ఉన్న తమ దేశ ఆటగాళ్లను స్వదేశానికి రప్పించడానికి బోర్డు ఎటువంటి చార్టర్ విమానాలను వేయడం లేదని తాజాగా స్పష్టం చేసిన క్రమంలో స్లేటర్‌కు చిర్రుత్తుకొచ్చింది. అసలు ఆస్ట్రేలియా పౌరుల్లాగా తమను చూడకపోవడం చాలా దారుణమన్నాడు. ఇక్కడ చదవండి: మాల్దీవులకు పారిపోయిన కామెంటేటర్ సీఎస్కే క్యాంప్‌లోనూ కరోనా కలకలం..! If our Government cared for the safety of Aussies they would allow us to get home. It's a disgrace!! Blood on your hands PM. How dare you treat us like this. How about you sort out quarantine system. I had government permission to work on the IPL but I now have government neglect — Michael Slater (@mj_slats) May 3, 2021 -
మాల్దీవులకు పారిపోయిన కామెంటేటర్
ఢిల్లీ: ప్రస్తుత ఐపీఎల్లో బయోబబుల్‌ను విదేశీ క్రికెటర్లు అసలు భరించలేకపోతున్నారు. ఎక్కడికి కదలకుండా ఒకే ప్లేస్‌లో ఎవరితోనూ సంబంధాలు లేకుండా ఉండటాన్ని వారికి కష్టంగా ఉంటుంది. ఈ క్రమంలోనే పలువురు క్రికెటర్లు ఐపీఎల్‌ను అర్థాంతరంగా వీడి తమ దేశాలకు వెళ్లిపోయారు. భారత్‌లో కరోనా తీవ్రత అధికంగా ఉండటం కూడా వీరిని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇలా చిక్కుకపోవడం వారికి మింగుడు పడటం లేదు. మరొకవైపు భారత్ నుంచి విమానరాకపోకలను పలుదేశాలు నిషేధం విధించడంతో ఐపీఎల్లో ఉన్న విదేశీ క్రికెటర్లు చేసేది ఏమీ లేకుండా పోయింది. కాగా, ఐపీఎల్లో కామెంటరీ ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఆసీస్ మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్ బయోబబుల్ నిబంధనను అతిక్రమించాడు. కొన్ని రోజుల నుంచి కామెంటరీ ప్యానల్ కనిపించన స్లేటర్ మాల్దీవులకు పారిపోయినట్లు తెలుస్తోంది. భారత్‌లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతోనే మాల్దీవుల మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మరికొంతమంది విదేశీ క్రికెటర్లు కూడా అదే రూట్‌ను ఎంచుకుని బయోబబుల్ నుంచి ఎస్కేప్ కావడానికి యత్నాలు ఆరంభించినట్లు సమాచారం. ఇక్కడ చదవండి: సీఎస్కే క్యాంప్‌లోనూ కరోనా కలకలం..! ‘ఇకపై వార్నర్‌ను సన్‌రైజర్స్ జెర్సీలో చూడలేం’ -
'వీరిద్దరు భారత క్రికెట్ టెంపోనూ మార్చారు'
ఢిల్లీ : మాజీ క్రికెటర్ రవిశాస్త్రి టీమిండియాకు ప్రధాన కోచ్‌గా ఎంపికైన తర్వాత భారత క్రికెట్లో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి కోచ్‌గా రవి తీసుకున్న నిర్ణయాలు జట్టు టెంపోను మార్చేసాయంటూ ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత మైకెల్ స్లేటర్ పేర్కొన్నాడు. స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రి గురించి స్లేటర్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. 'రవిశాస్త్రి, విరాట్ కోహ్లిలను నేను చాలా దగ్గర్నుంచి చూశాను. ఒకరికొకరు చాలెంజింగ్‌గా కనిపించినా.. పని విషయంలో మాత్రం ఇరువురు పరస్పర నిర్ణయాలను గౌరవించుకుంటారు. కోహ్లి ఏదైనా చెబితే దానిని శాస్త్రి ఓపికగా వింటాడు.. కోహ్లి విషయంలోనూ ఇదే జరగుతుంది. ఇద్దరి నిర్ణయాల్లో కొన్నిసార్లు తప్పులు కనిపించినా.. సర్దుకుపోవడం గమనించాను. అంతేకాదు కామెంటరీ బాక్స్‌లో నేను శాస్త్రిని చాలా దగ్గర్నుంచి చూశాను. నేను పని చేసిన అత్యుత్తమ కామెంటరీల్లో రవిశాస్త్రి ఒకడు. ఇద్దరిలో చాలా తేడాలున్నా.. అవన్నీ పక్కనపెట్టి కలిసి పనిచేయడం ద్వారా భారత క్రికెట్ టెంపోను మార్చివేశారు.'అంటూ స్లేటర్ పేర్కొన్నాడు. కాగా 2017లో అనిల్ కుంబ్లే టీమిండియా ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేసిన తర్వాత అతని స్థానంలో రవిశాస్త్రి వచ్చాడు. కుంబ్లే సలహాలు తనకు నచ్చేవి కావని కోహ్లి బాహటంగానే ప్రకటించడం.. ఇద్దరి మధ్య మనస్పర్థలు దారి తీసింది. అప్పటినుంచి భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్న శాస్త్రి పదవిని ఈ మధ్యనే మరో రెండేళ్లకు పొడిగించారు. వచ్చే ఏడాది భారత్‌లో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్ వరకు శాస్త్రి ప్రధాన కోచ్ పదవిలో కొనసాగనున్నారు. (ధోని వాస్తవమేంటో చూపించాడు : యూవీ) -
వీడియో పోస్ట్ చేసి.. షేన్ వార్న్ బుక్కయ్యాడు
హోబర్ట్: మాజీ దిగ్గజ క్రికెటర్లు షేన్ వార్న్, కెవిన్ పీటర్సన్, మైఖేల్ స్లేటర్లకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా వేశారు. ఆస్ట్రేలియాలో మాజీ క్రికెటర్లు కారు రైడింగ్‌కు వెళ్లినపుడు సీటు బెల్ట్ పెట్టుకోనందుకు పోలీసులు దాదాపు 20,500 రూపాయల జరిమానా విధించారు. షేన్ వార్న్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో ఈ ముగ్గురూ ట్రాఫిక్ రూల్స్ పాటించనట్టు తేలింది. ఆస్ట్రేలియాలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు వార్న్, పీటర్సన్, స్లేటర్లు కామెంటేటర్లుగా పనిచేస్తున్నారు. ఆసీస్ మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ కారులో మాజీ కీపర్ ఇయాన్ హేలీతో కలసి వీరు ముగ్గురు రైడింగ్‌కు వెళ్లారు. రెండో టెస్టు మూడో రోజు ఆట అనంతరం ఈ వీడియోను వార్న్ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. 4 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో మార్క్ టేలర్ కారు డ్రైవింగ్ చేస్తున్నట్టు కనిపించగా, ముందు సీట్లో అతని పక్కన హేలీ కూర్చున్నాడు. వీరిద్దరూ సీటు బెల్టులు ధరించగా, కారు వెనుక సీట్లో కూర్చున్న వార్న్, పీటర్సన్, స్లేటర్లు సీటు బెల్ట్ పెట్టుకోలేదు. ఈ వీడియో ఫేస్బుక్లో వైరల్ కావడంతో తస్మేనియన్ పోలీసులు మంగళవారం ఈ విషయాన్ని గుర్తించారు. టేలర్, హేలీలను మినహాయించి, నిబంధనలను ఉల్లంఘించిన వార్న్, పీటర్సన్, స్లేటర్లకు జరిమానా వేశారు.