Ex-Cricketer Michael Slater Arrested: గృహహింస ఆరోపణల నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ స్లాటర్ అరెస్టైనట్లు సమాచారం. సిడ్నీలోని మాన్లీలో గల తన నివాసంలో స్లాటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం జరిగిన ఓ ఘటన ఆధారంగా అందిన ఫిర్యాదు మేరకు అతడిని అరెస్టు చేసినట్లు న్యూసౌత్ వేల్స్ పోలీసులు వెల్లడించారు.
ఈ మేరకు... ‘‘అక్టోబరు 12న... గృహహింస ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈస్టర్న్ సబర్బ్స్ పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తు ఆధారంగా బుధవారం ఉదయం 9 గంటల 20 నిమిషాలకు అతడిని అరెస్టు చేశాం’’అని ప్రకటన విడుదల చేశారు. అయితే, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించిన మైకేల్ స్లాటర్.. టెస్టు బ్యాటింగ్ టాపార్డర్‌లో చోటు దక్కించుకున్నాడు. కెరీర్‌లో మొత్తంగా 5312 పరుగులు చేసిన స్లాటర్.. 2004లో ఆటకు వీడ్కోలు పలికాడు. బ్రాడ్‌కాస్టర్‌గా, టెలివిజన్ పండిట్‌గా గుర్తింపు సంపాదించాడు.
చదవండి: T20 World cup 2021: ధోనికి వయస్సు అయిపోలేదు.. మాకు పోటీ ఇవ్వగలడు: కేఎల్ రాహుల్
Comments
Please login to add a commentAdd a comment