14 సిక్సులు.. 34 ఫోర్లతో 355 నాటౌట్! | kevin pietersen smashes not out 355 with 14 sixers and 34 fours | Sakshi
Sakshi News home page

14 సిక్సులు.. 34 ఫోర్లతో 355 నాటౌట్!

Published Tue, May 12 2015 7:22 PM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

14 సిక్సులు.. 34 ఫోర్లతో 355 నాటౌట్! - Sakshi

14 సిక్సులు.. 34 ఫోర్లతో 355 నాటౌట్!

అతడి వయసు 34.. అయినా కూడా 34 ఫోర్లు, 14 సిక్సులతో కేవలం 373 బంతుల్లోనే రికార్డు స్థాయిలో 355 పరుగులు (నాటౌట్) చేశాడు. ఆ అరివీర భయంకరమైన బ్యాట్స్మన్ ఎవరో తెలుసుకోవాలనుందా.. ఇంకెవరు.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్. తన కెరీర్లోనే అత్యుత్తమ స్కోర్ నమోదు చేశాడు. అయితే ఇంత చేసినా కూడా ఇంగ్లండ్ జాతీయ జట్టులోకి కేపీ రావడం మాత్రం వీలు కాదంటూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ ఆండ్రూ స్ట్రాస్ అతడి ఆశలపై నీళ్లు చల్లేశాడు. దక్షిణ లండన్లో జరిగిన ఓ మ్యాచ్లో మైదానం అన్నివైపులకూ బంతిని పరుగులు తీయించి రికార్డులు తిరగరాశాడు.

సర్రే జట్టు తరఫున కౌంటీ ఛాంపియన్షిప్ కోసం లీసెస్టర్షైర్తో ఓవల్లో జరిగిన మ్యాచ్లో ఈ మోత మోగించాడు. ఈ మ్యాచ్లో సర్రే జట్టు తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 528 పరుగులు చేయగా, జట్టులో మరే ఇతర ఆటగాడు మాత్రం 36 కంటే ఎక్కువ పరుగులు చేసిన పాపాన పోలేదు. కేపీ ఒక్కడే మొత్తం ఆట ఆడేసుకున్నాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement