
కెవిన్ పీటర్సన్
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పదేళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడే దేశాలు తగ్గిపోతాయని జోస్యం చెప్పాడు. కేవలం ఐదు దేశాల మాత్రమే టెస్ట్ క్రికెట్ కొనసాగిస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ మాత్రమే టెస్ట్ క్రికెట్ ఆడతాయని వెల్లడించాడు. మిగతా దేశాల క్రికెటర్లు పొట్టి ఫార్మాట్‌కే పరిమితమవుతారని ట్వీట్ చేశాడు.
తాను చెప్పింది అక్షరాల నిజమవుతుందని, కావాలంటే తన ట్వీట్‌ను గుర్తుపెట్టుకోవాలన్నాడు. తన అంచనాల ప్రకారం న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు భవిష్యత్తులో టెస్ట్ క్రికెట్ కొనసాగించబోవని అన్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడేందుకు దుబాయ్ వెళుతూ అతడు ఈ సంచలన ట్వీట్ పెట్టాడు. దీనిపై మాజీ ఆటగాళ్లు, క్రికెటర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.
Here we go - in 10yrs the only cricket Test playing nations will be, England, SA, India, Pakistan & Australia.
— Kevin Pietersen (@KP24) February 19, 2018
The rest will all be white ball cricketers!
Just remember this tweet!
Comments
Please login to add a commentAdd a comment