
పెర్త్:యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు పేలవ ప్రదర్శనకు ఆ జట్టు ప్రస్తుత కెప్టెన్ జోరూట్‌ను బాధ్యుణ్ని చేస్తూ వ్యంగ్యంగా ట్వీట్ చేసిన మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్‌పై అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు. ఒకసారి పీటర్సన్ తనను అద్దంలో చూసుకుంటే బాగుంటుందంటూ అభిమానులు చురకలంటించారు. జో రూట్ వాటర్ గన్‌తో ఉన్న మార్ఫింగ్ చేసిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన పీటర్సన్.. దానికి కెప్టెన్ ఫెంటాస్టిక్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీనికి సంబంధించి ఇంగ్లిష్ అభిమానులు పీటర్సన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు.
' నా పాకెట్‌లో కూడా ఒక పిస్టల్ ఉంది. దాన్ని నీపై గురిపెడతా' అని ఒక అభిమాని ట్వీట్ చేయగా, 'ఇది చాలా అతి' అంటూ మరొక అభిమాని పేర్కొన్నాడు. 'గతంలో ఆసీస్ చేతిలో వైట్‌వాష్ అయిన ఇంగ్లండ్ జట్టులో నువ్వు ఎప్పుడు లేవా.. నిన్ను ఒకసారి అద్దంలో చూసుకుంటే బాగుంటుంది.. నీ వ్యక్తిగత ప్రదర్శనతో ఇంగ్లండ్ జట్టుకు విజయాలు అందించలేదనే విషయం తెలుసుకో' అని మరో అభిమాని ఘాటుగా స్పందించాడు. యాషెస్ సిరీస్‌ను ఇంగ్లండ్ 0-3 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆసీస్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా ఆసీస్ ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉండగానే యాషెస్‌ను గెలుచుకుంది.
Captain Fantastic! #Ashes pic.twitter.com/rV3n55P7Y5
— KP (@KP24) 18 December 2017