
లండన్: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ సామ్సన్‌లో నిలకడగా ఆడే బ్యాట్స్‌మన్ కాదనే అపవాదు నుంచి బయటపడాలని కోరుతున్నాడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్. సామ్సన్ అంటే తనకు ఎంతో ఇష్టమని, అతని షాట్లు కొట్టే తీరు ముచ్చటగా ఉంటుందన్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సామ్సన్ చేసిన సెంచరీ తనను ఎంతో ఆకట్టుకుందున్న కెవిన్.. ఆ మ్యాచ్‌లో గెలుపు అంచుల వరకూ వచ్చి సరైన ముగింపు లేకపోవడం నిజంగా దురదృష్టమన్నాడు.
‘ప్రతీ ఏడాది సామ్సన్ ఆటను ఎక్కువగా ఆస్వాదిస్తా. సామ్సన్ షాట్లను నేను బాగా ఇష్టపడతా. నేను గతేడాది ఐపీఎల్‌లో కామెంటరీ ఎక్కువగా చెప్పాను. ఎక్కువగా అతని నిలకడ గురించి మాట్లాడా. గతేడాది అతను మధ్యలో ఫామ్‌ను కోల్పోయాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు పరుగులే చేసి ఔటయ్యాడు.. అది అతనికి రెండో మ్యాచేనని, ఇంకా చాలా మ్యాచ్‌లు ఉన్నందున సామ్సన్‌పై విమర్శలు అనవసరమన్నాడు. ప్రస్తుతం అతని బాధ్యతలు వేరే స్థాయిలో ఉన్నాయని, రాయల్స్ కెప్టెన్ అని పేర్కొన్నాడు. బెన్ స్టోక్స్ లేని లోటును పూడ్చుకోవాల్సిన అవసరం సామ్సన్‌పై ఉందన్నాడు.
కాగా, సామ్సన్ అంతర్జాతీయ కెరీర్ గురించి పీటర్సన్ మాట్లాడుతూ.. ‘ భారత్ తరఫున ఏ పరిస్థితుల్లోనైనా తన పవర్ ప్లే క్రికెట్‌తో ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. సామ్సన్. పరుగులు చేసిన తర్వాత ఇంకా పరుగులు చేస్తాడు. అలానే చాలాసార్లు విఫలం కూడా అయ్యాడు. అటువంటి సమయంలో డెడికేషన్ అవసరం. అతను అంతర్జాతీయ స్థాయి ఆడే క్రికెటర్. అక్కడ పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఒకసారి క్లిష్ట సమయం వచ్చిందంటే అది మరిన్ని సమస్యల్ని తీసుకొస్తుంది. అంతర్జాతీయ క్రికెట్ ఆడే పరిస్థితుల్ని మరింత క్లిష్టం చేసుకోవద్దు’ అని తెలిపాడు.
ఇక్కడ చదవండి: 'రనౌట్ చేశానని నా మీదకు కోపంతో రావుగా'
రసెల్.. ఇది మమ్మల్ని బాధిస్తోంది..!
Comments
Please login to add a commentAdd a comment