‘ఇంగ్లండ్‌ క్రికెట్‌ పయనం అర్థం కావడం లేదు’ | Kevin Pietersen Questions Englands Sense of Direction | Sakshi
Sakshi News home page

‘ఇంగ్లండ్‌ క్రికెట్‌ పయనం అర్థం కావడం లేదు’

Published Sun, Jun 10 2018 10:46 AM | Last Updated on Sun, Jun 10 2018 10:55 AM

Kevin Pietersen Questions Englands Sense of Direction - Sakshi

లండన్‌: వన్డేలపైనే పూర్తిగా దృష్టిసారిస్తూ.. టెస్టు క్రికెట్‌ను నిర్లక్ష్యం చేస్తు న్నదంటూ ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ)పై ఆ దేశ మాజీ బ్యాట్స్‌మన్‌ కెవిన్‌ పీటర్సన్‌ విమర్శలు గుప్పించాడు. రెండేళ్లుగా వన్డేల్లో మెరుగ్గా రాణిస్తున్న ఇంగ్లండ్‌.. యాషెస్‌, న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లను చేజార్చుకుంది. ఇటీవల సొంతగడ్డపై పాకిస్తాన్‌తో రెండుటెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది.

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ క్రికెట్‌ పయనం తనకు అర్థం కావడంలేదన్న పీటర్సన్‌.. వరల్డ్‌కప్‌ కోసం టెస్టులను పణంగా పెడుతున్నారన్నాడు. ఇది ఎంతమాత్రం సరైన విధానం కాదన్నాడు. అసలు వారు ఏ మార్గదర్శకత్వంలో ముందుకు వెళుతున్నారో తనకు బోధ పడటం లేదన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement