
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ (కేపీ) సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటాడు. తన సోషల్ మీడియా ఖాతాలో ఒకింత వికృతంగా ఉండే ఫన్నీ వీడియోలు పెడుతుంటాడు. తాజాగా కేపీ ఓ విచిత్రమైన వీడియో షేర్ చేశాడు. అత్యంత భారీ పాముతో ఏమాత్రం బెరుకు, భయపడకుండా ఆడుతున్న బుడ్డోడి వీడియోను కేపీ షేర్ చేశాడు. చూస్తేనే ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న పాముతో బుడ్డుడు ఆటలు ఆడటమే కాదు.. దాని మెడ పట్టుకొని ఎత్తుకునేందుకు ప్రయత్నించడం.. ఆ పాము మీద కూచొని.. అది కదులుతుంటే.. ఎంజాయ్ చేయడం ఈ వీడియోలో చూడొచ్చు.‘వాట్ ఆన్ ఎర్త్’ అంటూ కేపీ పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.