హిందీలో పీటర్సన్‌ ట్వీట్‌.. సూపర్‌ అంటున్న ఫ్యాన్స్‌ | Kevin Pietersen Independence Day Wishes Hindi Tweet To Indian Fans Viral | Sakshi
Sakshi News home page

Kevin Pietersen: హిందీలో పీటర్సన్‌ ట్వీట్‌.. సూపర్‌ అంటున్న ఫ్యాన్స్‌

Published Sun, Aug 15 2021 5:28 PM | Last Updated on Sun, Aug 15 2021 5:42 PM

Kevin Pietersen Independence Day Wishes Hindi Tweet To Indian Fans Viral - Sakshi

లండన్‌: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా  ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌ హిందీలో చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. '' భారతీయులందరికి 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనం ఎన్నో విషాధాలు చూశాం.. వాటన్నింటిని మరిచి కొత్త ఆశలతో ముందడుగేయండి.  మీ సెలబ్రేషన్స్‌ను నేను మిస్సవుతున్నా.. త్వరలోనే ఇండియాకు వస్తా అప్పుడు కలుద్దాం.. లవ్‌ కేపీ'' అని ట్వీట్‌ చేశాడు. 

ఇక పీటర్సన్‌ ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించాకా కామెంటేటర్‌గా బిజీ అయ్యాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లతో  పాటు దేశవాలీ టోర్నీలకు పీటర్సన్‌ కామెంటరీ నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం పీటర్సన్‌ హండ్రెడ్‌ టోర్నీలో కామెంటరీ చేస్తున్నాడు. ఇక కెవిన్‌ పీటర్సన్‌ ఇంగ్లండ్‌ తరపున 104 టెస్టుల్లో 8181 పరుగులు, 136 వన్డేల్లో 4440 పరుగులు, 37 టీ20ల్లో 1176 పరుగులు సాధించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement