Photo: IPL Twitter
ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్ లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుధవారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 32 బంతులెదుర్కొని 39 పరుగులు చేశాడు. టి20 క్రికెట్‌లో అటాకింగ్ గేమ్ ఆడాల్సింది పోయి వన్డే తరహాలో స్ట్రైక్ రొటేట్ చేస్తూ కేవలం నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ మాత్రమే కొట్టి ఔటయ్యాడు. ఈ సీజన్ ఆరంభం నుంచి వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో రాహుల్ ఆటతీరు ఇలాగే కొనసాగుతుంది.
ఇక రాజస్తాన్, లక్నో మ్యాచ్‌కు కెవిన్ పీటర్సన్ కామెంటేటర్‌గా వ్యవహరించాడు. లైవ్ కామెంటరీలో పీటర్సన్ మాట్లాడుతూ.. ''కేఎల్ రాహుల్ బ్యాటింగ్ నాకు ఇంతకముందు ఎన్నడూ లేనట్లుగా పరమ బోరింగ్‌గా అనిపించింది.'' అంటూ పేర్కొన్నాడు.
ప్రస్తుతం పీటర్సన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ''పీటర్సన్ అన్న మాటలు అక్షరాల నిజం.. కేఎల్ రాహుల్ టి20ల్లో వన్డే, టెస్టు బ్యాటింగ్‌ను తలపిస్తున్నాడు''..'' నిజమేగా.. రాహుల్ తన జిడ్డు బ్యాటింగ్‌తో విసిగిస్తున్నాడు.'' అంటూ కామెంట్ చేశారు.
చదవండి: బులెట్ కన్నా వేగంగా.. అక్కడుంది శాంసన్ బ్రో!
Oh man.. Kevin Pietersen said this in live commentary "Watching KL Rahul bat in the powerplay is the most boring thing I've ever done." pic.twitter.com/y8m4g2ZNT4
— Vishal. (@SPORTYVISHAL) April 19, 2023
Comments
Please login to add a commentAdd a comment