
IND VS ENG 5th Test Reschedule: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన చివరిదైన ఐదో టెస్ట్ నాటకీయ పరిణామాల మధ్య షెడ్యూల్ సమయానికి మూడు గంటల ముందు రద్దైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై బీసీసీఐ, ఈసీబీల మధ్య చర్చలు కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌ను వచ్చే ఏడాది భారత పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు నిర్వహించాలని ఇరు బోర్డులు పరస్పర అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మ్యాచ్ నిర్వహణపై బీసీసీఐ ప్రతిపాదనను భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్వాగతించాడు. ఈ సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాడు.
2008లో ముంబై దాడులు ప్రారంభమైన రోజున (నవంబర్ 26) కటక్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే మ్యాచ్ జరగాల్సి ఉండింది. దాడుల కారణంగా 7మ్యాచ్‌ల సిరీస్‌లోని చివరి రెండు వన్డేలను రద్దయ్యాయి. దాంతో ఇంగ్లండ్ క్రికెటర్లు స్వదేశానికి వెళ్లిపోయారు. దాడుల నేపథ్యంలో ఆ తర్వాత జరగాల్సిన 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌పై సందిగ్ధత నెలకొంది. అయితే టెస్టు సిరీస్ ఆడటానికి ఇంగ్లండ్ జట్టు భారత్‌కు తిరిగి రావడంతో అప్పట్లో ఆ జట్టుపై ప్రశంసల వర్షం కురిసింది.
షెడ్యూల్లో ఉన్న ప్రకారం అహ్మదాబాద్, ముంబైలో కాకుండా అహ్మదాబాద్, చెన్నైలలో ఆ రెండు మ్యాచ్‌లు జరిగాయి. ఈ సిరీస్‌లో కెవిన్ పీటర్సన్ నేతృత్వంలోని ఇంగ్లీష్ జట్టు భారత్ చేతిలో 0-1తో ఓడింది. కాగా, సునీల్ గవాస్కర్ ఆ విషయాన్ని గుర్తుచేస్తూ.. 2008లో ఇంగ్లండ్ చూపిన సానుకూల ధోరణిని మరచిపోకూడదని, ఉగ్రదాడి తర్వాత టెస్టు సిరీస్ కోసం ఇంగ్లీష్ జట్టు మళ్లీ భారత్‌కు వచ్చిందని, ఇప్పుడు మనం కూడా అందుకు కృతజ్ఞత చూపాలని కోరాడు. నాడు ఇంగ్లండ్ జట్టు ఉగ్రదాడి తర్వాత కూడా భారత్‌లో పర్యటించిందంటే.. అది కేవలం నాటి కెప్టెన్ కెవిన్ పీటర్సన్ చొరవ వల్లేనన్నాడు.
చదవండి: ఒక్క టెస్ట్ మ్యాచ్ రద్దవడం వల్ల ఇంత భారీ నష్టమా..?
Comments
Please login to add a commentAdd a comment