ఢిల్లీ: ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరులో జరిగే ఐపీఎల్ వేలానికి సంబంధించి ఆటగాళ్ల జాబితాలు సిద్ధమయ్యాయి. డాషింగ్ బ్యాట్స్‌మన్ సెహ్వాగ్, ఆల్‌రౌండర్ యువరాజ్‌లతో పాటు ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్ ప్రీమియర్ జాబితా (తొలి జాబితా)లో చోటు సంపాదించుకున్నారు.
వార్నర్, జయవర్ధనే, కలిస్ తదితర స్టార్ క్రికెటర్లూ ఇందులో ఉన్నారు. ఇక రెండో జాబితాలో మెకల్లమ్, బెయిలీ, డుప్లెసిస్, జహీర్, అమిత్ మిశ్రా తదితరులు ఉన్నారు. మొత్తం 514 మంది ఆటగాళ్లను 53 సెట్లుగా విభజించారు. తొలుత 219 మంది క్యాప్డ్ ఆటగాళ్లను వేలం వేస్తారు. ఆ తర్వాత అన్‌క్యాప్డ్ ఆటగాళ్ల వేలం మొదలవుతుంది.
తొలి జాబితాలో వీరూ, యువీ
Published Fri, Feb 7 2014 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM
Advertisement
Advertisement