ఇంగ్లండ్‌ Vs పాకిస్తాన్‌: పీటర్సన్‌ Vs  అక్తర్‌ | Kevin Pietersen Brutally Trolls Shoaib Akhtar With Epic Reply To Motivational Tweet | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ Vs పాకిస్తాన్‌: పీటర్సన్‌ Vs  అక్తర్‌

Published Mon, Jun 3 2019 1:19 PM | Last Updated on Mon, Jun 3 2019 1:57 PM

Kevin Pietersen Brutally Trolls Shoaib Akhtar With Epic Reply To Motivational Tweet - Sakshi

లండన్‌ : ప్రపంచకప్‌ 2019లో భాగంగా నేడు (సోమవారం) ఆతిథ్య ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ సోమవారం సాయంత్రం ఉన్నప్పటీకీ.. ఇరు దేశాల మాజీ ఆటగాళ్ల మధ్య మాత్రం అప్పుడే ప్రారంభమైంది. పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌.. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ల మధ్య ట్విటర్‌ వేదికగా మాటలయుద్దం జరుగుతోంది. ఇప్పటికే వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్‌లో కంగుతిన్న పాక్‌ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలని ఆ దేశ అభిమానులు, మాజీ ఆటగాళ్లు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అక్తర్‌ తమ ఆటగాళ్లకు స్పూర్తిదాయకంగా ఉండేలా ఓ ట్వీట్‌ చేశాడు. దానికి కెవిన్‌ పీటర్సన్‌ను ఔట్‌ చేసిన ఆనందంలో ఉన్న తన పాత ఫొటోను జత చేశాడు. పైగా దీనికి ‘ మీ జట్టుకు మీరు ప్రాతినిథ్యం వహించాలంటే రక్తం, చెమట, దూకుడు, గుండే వేగంగా కొట్టుకోవడం వంటివి ఉండాలి. ఇవే మిమ్మల్ని తలెత్తుకునేలా చేస్తాయి. వెళ్లండి గట్టిపోటీనివ్వండి’ అంటూ ట్వీట్‌ చేశాడు.

ఇక ఈ ట్వీట్‌లో తన ఫొటో ప్రస్తావించడంతో కెవిన్‌ పీటర్సన్‌ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ‘నేను నీ ట్వీట్‌తో వాదించదల్చుకోలేదు బడ్డీ. నేనే నీ బౌలింగ్‌లో సెంచరీ చేసినప్పుడు కూడా ఇలానే సంబరాలు చేసుకుంటావు కదా! గొప్ప పిచ్చి’ అంటూ అక్తర్‌​కు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చాడు. దీనికి అక్తర్‌ కూడా బదులిచ్చాడు. ‘నా సహచరుడా నీవు నా బౌలింగ్‌లో ఔటైనప్పుడు నేను చేసే కోడి డ్యాన్స్‌ నీకు ఇష్టం కదా’ అని ట్వీట్‌ చేశాడు. అవును ఇష్టమే బడ్డీ అని పీటర్సన్‌ అనగా.. ‘నీ ఇష్టాన్ని నీ శైలిలో పంపించు’ అని అక్తర్‌ కోరాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ వార్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. క్రికెట్‌కు దూరమైనప్పటి నుంచి ఇద్దరు ఆటగాళ్లు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇటీవల పాక్‌ ఘోరపరాజయాన్ని తట్టుకోలేని అక్తర్‌.. పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు కొవ్వు ఎక్కువైందని ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement