మాంచెస్టర్: వరల్డ్‌కప్‌లో తమ జట్టు లీగ్ దశలోనే ఇంటి బాట పట్టిన తరుణంలో ఇక తన మద్దతు టీమిండియాకే అంటున్నాడు పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. ఉపఖండంలో భాగమైన భారత జట్టే విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు అక్తర్ తెలిపాడు. ఈసారి వరల్డ్‌కప్ ఉప ఖండపు జట్టే సొంతం చేసుకోవాలనే తన కోరికని, ఆ క్రమంలోనే మెగా టోర్నీలో మిగిలి ఉన్న భారత్‌కే తాను మద్దతుగా నిలుస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇక సెమీస్‌లో భారత జట్టు ప్రత్యర్థి న్యూజిలాండ్ ఒత్తిడిలో పడకుండా ఉంటేనా గట్టి పోటీ ఇస్తుందన్నాడు.
సాధారణంగా మేజర్ టోర్నీల్లో న్యూజిలాండ్ ఎక్కువ ఒత్తిడికి లోనవుతుందనే విషయం గతంలో చాలా సందర్భాల్లో నిజమైందన్నాడు. దాంతో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారతే ఫేవరెట్ అని అక్తర్ స్సష్టం చేశాడు. భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రోహిత్ శర్మపై అక్తర్ ప్రశంసలు కురింపించాడు. రోహిత్ శర్మ షాట్ సెలక్షన్, టైమింగ్ అత్యద్భుతంగా ఉందన్నాడు. రోహిత్ గేమ్‌ను అర్థం చేసుకునే తీరు అమోఘమన్నాడు. మరొకవైపు కీలక సమయంలో కేఎల్ రాహుల్ కూడా సెంచరీతో ఆకట్టుకోవడం శుభ పరిణామని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ అక్తర్ తెలిపాడు
Comments
Please login to add a commentAdd a comment