కరాచీ: కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భారత్ చూపిస్తున్న చొరవను పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సుమారు 130 కోట్ల మంది జనతా కర్ఫ్యూలో ఆదివారం భాగస్వామ్యం కావడాన్ని పరోక్షంగా ప్రస్తావించిన షోయబ్ అక్తర్.. కరోనా వైరస్ కట్టడిలో పాకిస్తాన్ ప్రభుత్వం అలక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించాడు. ఇప్పటికీ పాక్ ప్రజల్లో కరోనా వైరస్ వ్యాప్తిపై అవగాహన లేదని చెప్పుకొచ్చిన అక్తర్ దొరికిన సెలవుల్లో అందరూ విహారయాత్రలకి వెళ్తుండటం శోచనీయమని వెల్లడించారు. (కోవిడ్‌కు దక్షిణ కొరియా కళ్లెం ఇలా..)
అయితే దీనిపై పరోక్షంగా స్పందించిన షోయబ్ అక్తర్ పాక్ ప్రజల్లో అవగాహన లేదని, ప్రభుత్వం కూడా అలక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ విషయంపై అక్తర్ మాట్లాడుతూ.. ‘అత్యవసర పరిస్థితి పైన నేను బయటికి వెళ్లాల్సి వచ్చింది. కానీ అక్కడ నేను ఎవరిని కలవలేదు. అలా అని నేను ఎవరితోనూ అత్యంతగా సన్నిహితంగా ఉండలేదు. నా ప్రయాణం మొత్తం కారు అద్దాలను మూసేసి ఉంచాను. కానీ బయట పరిస్థితులు మాత్రం నేను గమనించాను.
ఒకే బైక్ పై నలుగురు వెళ్ళడం, రోడ్డుపైన భోజనాలు చేయడం, సెలవు దొరకడంతో విహార యాత్రకు వెళ్ళడం గమనించాను. ఇలా గుంపులు గుంపులుగా కలిస్తేనే వైరస్ సోకుతుంది. దీనిపైన భారత్‌లో ఒకరోజు కర్ఫ్యూలో ప్రజలంతా భాగస్వామ్యం అయ్యారు. కానీ పాకిస్తాన్ ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది యావత్ దేశానికే ప్రమాదం. చైనాలో మొదలైన ఈ కరోనా వైరస్ క్రమ క్రమంగా ఇతర దేశాలకు కూడా వ్యాపించింది. దాదాపుగా 180 దేశాలకు పైగా వ్యాపించిన ఈ వైరస్ వలన 15 వేల మంది మరణించారు. కాగా కరోనా వైరస్ కారణంగా పీఎస్‌ఎల్‌ను సెమీస్ దశలో రద్దు చేసిన పీసీబీ.. విదేశీ క్రికెటర్లని వారి స్వదేశాలకి పంపించింది. ఇదే క్రమంలో ఆ టోర్నీలో ఆడిన క్రికెటర్లందరికీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించింది. కానీ.. అన్నీ నెగటివ్‌గా తేలినట్లు ప్రకటించింది. కాగా పాక్‌లో ఇప్పటికే సుమారు 800 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment