కరాచీ: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ టోర్నమెంట్‌లో ఆరంభం కావడానికి సుదీర్ఘ సమయం పట్టడం ఖాయమని మరోసారి జోస్యం చెప్పాడు పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. ఇప్పట్లో క్రికెట్ మ్యాచ్‌లు అనే ప్రస్తక్తే ఉండదన్నాడు. అసలు ప్రపంచం పట్టాలెక్కడానికి ఏడాది సమయం పడుతుందని, అటువంటప్పుడు క్రికెట్ టోర్నీలో ఎలా ఆరంభం కావడం ఎలా సాధ్యమన్నాడు. ‘ ప్రస్తుతం వరల్డ్ అంతా లాక్‌డౌన్‌లోనే ఉంది. మరి ఏమైనా మెరుగుదల కనిపించిందా అంటే అదీ లేదు. ఇప్పటివరకూ మెజార్టీ దేశాల్లో కరోనా వైరస్ విజృంభణ ఎలా కొనసాగుతుందో కనబడుతుంది. దాంతో ప్రపంచం గాడిలో పడాలంటే ఒక ఏడాది సమయం కచ్చితంగా పడుతుంది. ఇక క్రికెట్ మ్యాచ్‌లను కూడా అప్పుడే చూసే అవకాశం ఉంది.
నా దృష్టిలో క్రికెట్ మ్యాచ్‌లు జరగడానికి ఏడాది సమయం కనీసం పడుతుంది. ఈ కరోనా వైరస్ ప్రభావం ఏడాది పాటు ఇబ్బంది పెట్టే అవకాశాలు లేకపోలేదు. ఈ సమయంలో మనం ఎంతో ధృడంగా ఉండాలి’ అని అక్తర్ పేర్కొన్నాడు. ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, ఇది ఎవరికీ అంతు పట్టని విషయమన్నాడు. ఇదిలా ఉంచితే, ఇక బౌలర్లు బంతిని షైన్ చేయడం కోసం లాలాజలం(సెలైవా) రుద్దడానికి సిద్ధంగా లేకపోతే దానికి ఐసీసీ మరో ప్రత్యామ్నాయాన్ని చూపెడుతుందని అక్తర్ అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఐసీసీ తీసుకునే ఏ నిర్ణయమైనా ఆహ్వానించదగిందేనని అక్తర్ పేర్కొన్నాడు. (అక్తర్ కెరీర్ దాల్మియా చలవే!)
Comments
Please login to add a commentAdd a comment