
ముంబై : టీమిండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌కు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్స్‌న్ పలు సూచనలిచ్చాడు. టీమిండియాకు గత కొంత కాలంగా బ్యాటింగ్‌లో నాలుగో స్థానం ఇబ్బందులకు గురిచేస్తోందని, ఇప్పటికే పలువురు ఆటగాళ్లకు అవకాశం ఇచ్చినా ఫలితం దక్కలేదన్నాడు. అయితే నాలుగో స్థానానికి అయ్యర్ సరిగ్గా ఒదిగిపోతాడని పీటరన్స్ అభిప్రాయపడ్డాడు. అయితే అయ్యర్ బ్యాటింగ్ టెక్నిక్‌లో కొన్ని లోపాలున్నాయని వాటిని సరిదిద్దుకోవాలని సూచించాడు. ఈ యువ క్రికెటర్ ముఖ్యంగా ఆఫ్ సైడ్ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలన్నాడు. దీనికోసం నెట్స్‌లో ఎక్కువసేపు శ్రమించాలన్నాడు. నెట్స్‌లో ప్రత్యేకంగా ఓ బౌలర్‌చే ఆఫ్ స్టంప్ బంతులు వేయించుకొని ప్రాక్టీస్ చేయాలన్నాడు. అదేవిధంగా ఎక్స్‌ట్రా కవర్ షాట్‌లపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని పీటర్సన్ పేర్కొన్నాడు.
ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి టీ20లో అయ్యర్(33 బంతుల్లో 62) అద్భుతంగా ఆడాడని టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్యణ్ కొనియాడాడు. ఆ మ్యాచ్‌లో ఈ యంగ్ క్రికెటర్ రాణించడంతోనే టీమిండియా సులువుగా గెలిచిందని అభిప్రాయపడ్డాడు. అయ్యర్ ఎంతో ప్రతిభావంతుడని, భవిష్యత్‌లో టీమిండియాకు ఎన్నో మరుపురాని విజయాలను అందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక వెస్టిండీస్‌తో జరిగిని రెండు టీ20ల్లో అయ్యర్ అంతగా రాణించనప్పటికీ ముంబై వేదికగా జరిగే నిర్ణయాత్మకమైన మ్యాచ్‌లో తప్పక రాణిస్తాడని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక తిరువనంతపురం వేదికగా విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ తీవ్రంగా నిరుత్సాహపరిచిన విషయం తెలిసిందే. ఇక టీమిండియా-వెస్టిండీస్ జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో టీ20 బుధవారం ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment