Kevin Pietersen Tweets After Losing PAN Card India IT Department Offers Help, Details Inside - Sakshi
Sakshi News home page

Kevin Pietersen: ఐపీఎల్‌ మెగావేలానికి వచ్చి పాన్‌కార్డ్‌ పోగొట్టుకున్న మాజీ క్రికెటర్‌

Published Wed, Feb 16 2022 7:34 AM | Last Updated on Wed, Feb 16 2022 9:01 AM

Kevin Pietersen Tweets Losing PAN Card India Income Tax Department Offers Help - Sakshi

ఇంగ్లండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ కెవిన్‌ పీటర్సన్‌ పాన్‌కార్డును పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం స్టార్‌స్పోర్ట్‌ బ్రాడ్‌కాస్టర్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న పీటర్సన్‌ ఐపీఎల్‌ మెగావేలం కవర్‌ చేయడానికి భారత్‌కు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ మాజీ ఆల్‌రౌండర్‌ పాన్‌కార్డు పోగొట్టుకున్నట్లు తెలిపాడు. ఈ విషయంలో తనకు సహాయం చేయాలంటూ ట్విటర్‌ ద్వారా విజ్ఞప్తి చేశాడు.

చదవండి: అందుకే మా ఆయన్ని ఎవరూ కొనలేదు.. స్టార్‌ ఆల్‌రౌండర్ భార్య 

''నా పాన్‌కార్డ్‌ ఎక్కడో పోయింది. ప్లీజ్‌ నాకు సాయం చేయండి. కొన్ని కార్యకలాపాల కోసం పాన్‌కార్డు అవసరం ఇప్పుడు చాలా ఉంది. అయితే పాన్‌కార్డును ఎలా పొందాలో తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా'' అంటూ ట్వీట్‌ చేశాడు. కాగా పీటర్సన్‌ ట్వీట్‌కు భారత ఆదాయపు పన్ను శాఖ స్పందించింది. ''డియర్‌ కెవిన్‌ పీటర్సన్‌.. మీకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మీ దగ్గర పాన్‌ వివరాలు ఉంటే మేము ఇచ్చే వెబ్‌సైట్‌ లింక్‌ను ఓపెన్‌ చేసి పాన్‌కార్డు రీ ప్రింట్‌కోసం ప్రయత్నించండి.  ఒకవేళ పాన్‌కార్డు వివరాలు అందుబాటులో లేకపోతే రీప్రింట్‌ కోసం తమ శాఖకు దరఖాస్తూ చేసుకోవచ్చు'' అని తెలిపింది. దీంతో తన ట్వీట్‌కు స్పందించిన భారత ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కెవిన్ పీటర్సన్​ కృతజ్ఞతలు తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement