
ఏప్రిల్‌లో ఎం.ఎస్. ఆత్మకథ
ఇటీవలే మరణించిన నటుడు ఎమ్మెస్ నారాయణ ఆత్మకథ త్వరలో పుస్తకంగా రానుంది. ఏప్రిల్ 16న ఆయన జయంతికి
ఇటీవలే మరణించిన నటుడు ఎమ్మెస్ నారాయణ ఆత్మకథ త్వరలో పుస్తకంగా రానుంది. ఏప్రిల్ 16న ఆయన జయంతికి ‘ఎం.ఎస్. నారాయణ - విజయం కోసం పోరాటం’ పేరుతో పుస్తకం విడుదల కానుంది. ‘‘నాన్న చెబుతుంటే, మిత్రుడు కూనపరాజు కుమార్ ఆ ఆత్మకథ రాశారు. నాన్న జీవిత, సినీ ప్రస్థానమంతా అందులో ఉంటుంది’’ అని బుధవారం జరగనున్న ఎమ్మెస్ పెద్దకర్మ సందర్భంగా ఆయన కుమారుడు విక్రవ్‌ు కుమార్ తెలిపారు.