ఏప్రిల్లో ఎం.ఎస్. ఆత్మకథ
ఇటీవలే మరణించిన నటుడు ఎమ్మెస్ నారాయణ ఆత్మకథ త్వరలో పుస్తకంగా రానుంది. ఏప్రిల్ 16న ఆయన జయంతికి ‘ఎం.ఎస్. నారాయణ - విజయం కోసం పోరాటం’ పేరుతో పుస్తకం విడుదల కానుంది. ‘‘నాన్న చెబుతుంటే, మిత్రుడు కూనపరాజు కుమార్ ఆ ఆత్మకథ రాశారు. నాన్న జీవిత, సినీ ప్రస్థానమంతా అందులో ఉంటుంది’’ అని బుధవారం జరగనున్న ఎమ్మెస్ పెద్దకర్మ సందర్భంగా ఆయన కుమారుడు విక్రవ్ు కుమార్ తెలిపారు.