జీవిత చరిత్ర రెడీ అవుతోంది: సానియా
తన జీవిత చరిత్ర సిద్ధం అవుతోందని, వచ్చే సంవత్సరమే.. అంటే 2015లో దాన్ని మార్కెట్లోకి విడుదల చేస్తానని హైదరాబాదీ టెన్నిస్ తార సానియామీర్జా తెలిపింది. ప్రస్తుతం తాను 2016 ఒలింపిక్స్ మీద పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నానని, అంతేతప్ప తనకు నటనపై ఏమాత్రం ఆసక్తి లేదని చెప్పేసింది.
అయితే.. జేమ్స్ బాండ్ సినిమాలో సానియా కనిపించనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ‘మూడుసార్లు మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్స్ గెలిచా. ఇప్పుడు ప్రపంచ చాంపియన్‌షిప్‌నూ గెలిచా. ఇక మిగిలింది మహిళల డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిలే. అందుకే దీనిపై దృష్టిపెట్టా’ అని సానియా వ్యాఖ్యానించింది. కాగా, సోనీపిక్స్ ఛానల్లో సానియా మీర్జా రొమాంటిక్ లుక్లో కనపడుతుందన్నది తాజా సమాచారం. అమ్మాయిలను పడగొట్టాలంటే అబ్బాయిలు ఎలా మెలగాలో రహస్యాలు చెబుతుంది. ఫిక్స్ స్కూల్ ఆఫ్ బాండింగ్ పేరుతో వచ్చే ఈ కార్యక్రమం నవంబర్ 22 నుంచి 12 వారాలు ప్రసారం కానుంది. అందులో ఆమె కొత్త అవతారంలో కనిపిస్తుంది.