jamesbond movie
-
‘నో టైమ్ టు డై’ వెరీ కాస్ట్లీ గురూ..
డేనియల్ క్రేగ్ నటించిన ‘నో టైమ్ టు డై’ హాలీవుడ్ జేమ్స్ బాండ్ చిత్ర నిర్మాణానికి ఇంతవరకు వచ్చిన అన్ని బాండ్ చిత్రాలకన్నా ఎక్కువ ఖర్చు అయిందట. డేనియల్ క్రేగ్ నటించిన ‘స్పెక్టర్’కు అత్యధికంగా 182 మిలియన్ పౌండ్లు ఖర్చుకాగా, ‘స్కైఫాల్’ చిత్రానికి 138 మిలియన్ పౌండ్లు ఖర్చు కాగా తాజా చిత్రం ‘నో టైమ్ టు డై’ నిర్మాణానికి 200 మిలియన్ పౌండ్లు (దాదాపు 1837 కోట్ల రూపాయలు ) ఖర్చయ్యాయని చిత్ర నిర్మాణ సంస్థ ‘బీ 25’ తాజాగా వెల్లడించింది. ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన ‘నో టైమ్ టు డై’ చిత్రం కరోనా వైరస్ విజృంభణ కారణంగా డిసెంబర్ నెలకు వాయిదా పడింది. జేమ్స్ బాండ్‌గా డేనియల్ క్రేగ్ నటించిన మొదటి చిత్రం ‘స్కైఫాల్’కాగా, ఆ తర్వాత వరుసగా క్యాసినో రాయల్, క్వాంటమ్ ఆఫ్ సొలేస్, స్పెక్టర్ చిత్రాల్లో నటించారు. నో టైమ్ టు డై ఆయన ఐదవ చిత్రం. శియాన్ క్యానరీ నటించిన తొలి జేమ్స్ బాండ్ చిత్రం ‘డోర్ నెం.’ నిర్మాణానికి 1962లో 800కే పౌండ్లు (దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలు) ఖర్చుకాగా ఇప్పుడు 200 మిలియన్ పౌండ్లు ఖర్చవడం విశేషమని హాలీవుడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వాస్తవానికి నో టైమ్ టు డై చిత్ర నిర్మాణానికి మరో 47 పౌండ్లు ఖర్చు అయ్యేవని, హాలీవుడ్ స్టూడియోలు రాయితీలు ఇవ్వడం ఈ మేరకు ఖర్చు తగ్గిందని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. -
కరోనా బారిన జేమ్స్‌బాండ్ నటి
న్యూయార్క్ : ఉక్రెయిన్‌లో జన్మించిన నటి, మోడల్ ఓల్గా కురెలెంకో తనకు కరోనా వైరస్ పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చినట్టు వెల్లడించింది. 2008 జేమ్స్‌బాండ్ మూవీ క్వాంటం ఆఫ్ సొలేస్లో ఓల్గా కురెలెంకో నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 2013 సైఫై మూవీలో ఒబ్లివిన్లోనూ ఆమె నటించారు. వారం రోజలుగా తాను అస్వస్తతతో బాధపడుతూ, కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో సమూహానికి దూరంగా ఇంట్లోనే ఒంటరిగా ఉన్నానని నటి (40) తన ఇన్స్టాగ్రాం ఖాతాలో పేర్కొన్నారు. వారం రోజుల నుంచి జ్వరం, తీవ్ర అలసటతో తాను బాధపడుతున్నానని, మీరు కూడా జాగ్రత్తగా ఉంటూ ప్రస్తుత పరిస్థితిని సీరియస్‌గా తీసుకోవాలని ఆమె సూచించారు. డబ్ల్యుహెచ్ఓ గతవారం కరోనా వైరస్‌ను అంతర్జాతీయ మహమ్మారిగా ప్రకటించిన అనంతరం అంతర్జాతీయ వినోద పరిశ్రమ నుంచి కరోనా బారినపడిన ప్రముఖుల్లో తాజాగా కురెలెంకో పేరు వెలుగుచూసింది. హాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ టామ్ హ్యాంక్స్, రీటా విల్సన్‌లకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. మరోవైపు వారాంతంలో కరోనాతో బాధపడుతూ యూనివర్సల్ మ్యూజిక్ అధినేత, సీఈవో లుసియన్ గ్రినేజ్ ఆస్పత్రిలో చేరారు. చదవండి : ‘నో టైమ్ టు డై’కి ఇది సమయం కాదు! -
సెన్సార్‌బోర్డు అవసరమా?
ముంబై: జేమ్స్ బాండ్ సినిమా ‘స్పెక్టర్’లో ముద్దుదృశ్యం తొలగింపు వివాదం లో సెన్సార్ బోర్డు చీఫ్ పహలాజ్ నిహలానీపై బాలీవుడ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 30 సెకన్ల సీన్‌ను 8 సెకన్లకు మార్చినంత మాత్రాన భారతదేశ నీతికి, సంస్కృతికి జరిగిన లాభమేంటో తెలపాలని బజరంగీ భాయ్‌జాన్ చిత్ర దర్శకుడు కబీర్ ఖాన్ ప్రశ్నించారు. అసలు సెన్సార్‌షిప్‌నే తొలగించాలని దర్శకుడు శ్యామ్ బెనగల్ డిమాండ్ చేశారు. తనపై వస్తున్న విమర్శలపై నిహలానీ స్పందిస్తూ.. నిబంధనల మేరకే అన్నీ చేస్తున్నామని.. ఎవరైనా అది తప్పని భావిస్తే.. పదవినుంచి తప్పుకునేందుకు సిద్ధమన్నారు. -
జీవిత చరిత్ర రెడీ అవుతోంది: సానియా
-
జీవిత చరిత్ర రెడీ అవుతోంది: సానియా
తన జీవిత చరిత్ర సిద్ధం అవుతోందని, వచ్చే సంవత్సరమే.. అంటే 2015లో దాన్ని మార్కెట్లోకి విడుదల చేస్తానని హైదరాబాదీ టెన్నిస్ తార సానియామీర్జా తెలిపింది. ప్రస్తుతం తాను 2016 ఒలింపిక్స్ మీద పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నానని, అంతేతప్ప తనకు నటనపై ఏమాత్రం ఆసక్తి లేదని చెప్పేసింది. అయితే.. జేమ్స్ బాండ్ సినిమాలో సానియా కనిపించనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ‘మూడుసార్లు మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ గెలిచా. ఇప్పుడు ప్రపంచ చాంపియన్‌షిప్‌నూ గెలిచా. ఇక మిగిలింది మహిళల డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిలే. అందుకే దీనిపై దృష్టిపెట్టా’ అని సానియా వ్యాఖ్యానించింది. కాగా, సోనీపిక్స్ ఛానల్లో సానియా మీర్జా రొమాంటిక్ లుక్‌లో కనపడుతుందన్నది తాజా సమాచారం. అమ్మాయిలను పడగొట్టాలంటే అబ్బాయిలు ఎలా మెలగాలో రహస్యాలు చెబుతుంది. ఫిక్స్ స్కూల్ ఆఫ్ బాండింగ్ పేరుతో వచ్చే ఈ కార్యక్రమం నవంబర్ 22 నుంచి 12 వారాలు ప్రసారం కానుంది. అందులో ఆమె కొత్త అవతారంలో కనిపిస్తుంది.