
న్యూయార్క్ : ఉక్రెయిన్‌లో జన్మించిన నటి, మోడల్ ఓల్గా కురెలెంకో తనకు కరోనా వైరస్ పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చినట్టు వెల్లడించింది. 2008 జేమ్స్‌బాండ్ మూవీ క్వాంటం ఆఫ్ సొలేస్‌లో ఓల్గా కురెలెంకో నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 2013 సైఫై మూవీలో ఒబ్లివిన్‌లోనూ ఆమె నటించారు. వారం రోజలుగా తాను అస్వస్తతతో బాధపడుతూ, కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో సమూహానికి దూరంగా ఇంట్లోనే ఒంటరిగా ఉన్నానని నటి (40) తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పేర్కొన్నారు.
వారం రోజుల నుంచి జ్వరం, తీవ్ర అలసటతో తాను బాధపడుతున్నానని, మీరు కూడా జాగ్రత్తగా ఉంటూ ప్రస్తుత పరిస్థితిని సీరియస్‌గా తీసుకోవాలని ఆమె సూచించారు. డబ్ల్యుహెచ్‌ఓ గతవారం కరోనా వైరస్‌ను అంతర్జాతీయ మహమ్మారిగా ప్రకటించిన అనంతరం అంతర్జాతీయ వినోద పరిశ్రమ నుంచి కరోనా బారినపడిన ప్రముఖుల్లో తాజాగా కురెలెంకో పేరు వెలుగుచూసింది. హాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ టామ్ హ్యాంక్స్, రీటా విల్సన్‌లకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. మరోవైపు వారాంతంలో కరోనాతో బాధపడుతూ యూనివర్సల్ మ్యూజిక్ అధినేత, సీఈవో లుసియన్ గ్రినేజ్ ఆస్పత్రిలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment