'అప్పుడు అంజలి నా పక్కనే ఉంది' | Anjali was there when Chappell offered captaincy, says Tendulkar | Sakshi
Sakshi News home page

'అప్పుడు అంజలి నా పక్కనే ఉంది'

Published Wed, Nov 5 2014 8:18 PM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM

సచిన్ టెండూల్కర్, అంజలి(ఫైల్)

సచిన్ టెండూల్కర్, అంజలి(ఫైల్)

ముంబై: సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే' పుస్తకాన్ని అభిమానులకు అంకితం ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఈ పుస్తకాన్ని బుధవారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ పుస్తకం రూపొందించడానికి మూడేళ్లు పట్టిందని సచిన్ తెలిపాడు. తన అన్న అజిత్ అనుక్షణం అండగా నిలిచాడని వెల్లడించాడు.

ద్రవిడ్ ను తప్పించి గ్రెగ్ చాపెల్ తనకు కెప్టెన్సీ ఇస్తానన్నప్పుడు తన భార్య అంజలి పక్కనే ఉందని తెలిపాడు. క్రికెటర్ భార్యగా ఉండడం తేలికైన విషయం కాదని పేర్కొన్నాడు. సచిన్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి గవాస్కర్, రవిశాస్త్రి, గంగూలీ, ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, హర్షబోగ్లే తదితరులు హాజరయ్యారు. తొలికాపీని మాస్టర్ బ్లాస్టర్ తన తల్లి రజనీకి స్వయంగా అందించాడు. రెండో కాపీని తన కోచ్ రమాకాంత్ అచ్రేకర్ కు బహుకరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement