Playing It My Way
-
లిమ్కా బుక్‌లో సచిన్ పుస్తకం
మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు సంపాదించింది. ఫిక్షన్, నాన్ ఫిక్షన్ పెద్దల విభాగంలో భారత దేశంలో అత్యధిక కాపీలు అమ్ముడుపోయిన పుస్తకంగా రికార్డులకెక్కింది. మొత్తం లక్షా 50 వేల 289 కాపీల ఆర్డర్‌ను ఈ పుస్తకం సొంతం చేసుకుంది. 6 నవంబర్ 2014న ఈ పుస్తకం విడుదలైంది. -
సచిన్ ఆత్మకథ మరో 'రికార్డు'!
న్యూఢిల్లీ:ఇప్పటికే పుస్తక ప్రపంచంలో అనేక రికార్డునులను కొల్లగొట్టిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే' మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తాజాగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో 'ప్లేయింగ్ ఇట్ మై వే' కు స్థానం దక్కింది. ఈ పుస్తకం అమ్మకాల్లో టాప్ లో నిలవడంతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కింది. అటు ఫిక్షన్, ఇటు నాన్ ఫిక్షన్ కేటగిరీలలో ప్లేయింగ్ ఇట్ మై వే తనదైన ముద్రను వేసింది. ఇదిలా ఉండగా, రూ.899 కవర్ పేజీ ధర కల్గిన సచిన్ ఆత్మకథ ఇప్పటివరకూ రిటైల్‌గా రూ. 13.51 కోట్లను వసూలు చేయడం మరో విశేషం. నవంబర్ 6, 2014వ సంవత్సరంలో సచిన్ ఆత్మకథ విడుదలైన సంగతి తెలిసిందే. సచిన్ ఆత్మకథను హచిటే ఇండియా సంస్థ ప్రచురించింది. ఈ పుస్తకం విడుదలకు ముందే 1,50,289 కాపీల మేర ఆర్డర్లను దక్కించుకుని పలు రికార్డులను బ్రేక్ చేసింది. ఈ క్రమంలోనే ‘యాపిల్’ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ జీవితచరిత్ర రికార్డును వెనక్కునెట్టడంతో పాటు, డాన్ బ్రౌన్ ఇన్ ఫెర్నీనో, జేకే రోలింగ్ క్యాజువల్ వెకెన్సీ తదితర పుస్తకాల రికార్డును సచిన్ ఆత్మకథ అధిగమించింది. -
సచిన్ ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వే ఆవిష్కరణ
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు జాతీయం కేంద్ర మంత్రివర్గ విస్తరణ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవంబరు 9న కొత్తగా 21 మందిని తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఇందులో నలుగురు కేబినెట్, ముగ్గురు సహాయ స్వతంత్ర ప్రతిపత్తి, 14మంది సహాయ మంత్రులు ఉన్నారు. దీంతో మంత్రి వర్గసభ్యుల సంఖ్య 66కు చేరింది. మనోహర్ పారికర్‌కు రక్షణ శాఖ, సురేశ్ ప్రభుకు రైల్వే , జగత్ ప్రకాశ్ నడ్డాకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, చౌదరి బీరేందర్ సింగ్‌కు గ్రామీణాభివృద్ధి శాఖలను కేటాయించారు. తెలంగాణ నుంచి బండారు దత్తాత్రేయకు స్వతంత్ర ప్రతిపత్తి గల సహాయమంత్రిగా కార్మిక, ఉపాధి కల్పన శాఖ. ఆంధ్రప్రదేశ్ నుంచి వై.సుజనా చౌదరికి సహాయ మంత్రిగా సైన్స్, టెక్నాలజీ శాఖను కేటాయించారు. ఢిల్లీ అసెంబ్లీ రద్దు ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు కేంద్ర కేబినెట్ నవంబరు 4న సిఫార్సు చేయగా, రాష్ట్రపతి ఆమోదించారు. నవంబరు 11 లోగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు గడువు ఇచ్చింది. ఈమేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజబ్జంగ్ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీలను కోరగా, ఎన్నికలకే మొగ్గు చూపారు. దీంతో గవర్నర్ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేశారు. జయపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రధాని సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకం కింద వారణాసికి సమీపంలోని జయపూర్ గ్రామాన్ని ప్రధాని నరేంద్రమోదీ దత్తత తీసుకున్నారు. ప్రతి పార్లమెంటు సభ్యుడు తమ నియోజక వర్గం నుంచి ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని దాన్ని మోడల్ గ్రామంగా రూపొందించడమే సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన ప్రధాన లక్ష్యం. ఢిల్లీలో ప్రపంచ ఆయుర్వేద సదస్సు ప్రపంచ ఆయుర్వేద ఆరో సదస్సుకు ఢిల్లీ వేదికైంది. దీనికి హాజరైన ప్రధాని నరేంద్రమోదీ ఆయుర్వేద వైద్యానికి భారత్ ప్రాధాన్యమిస్తున్నట్లు ప్రకటించారు. పొగాకు ఉత్పత్తులపై బీహార్ నిషేధం పొగాకు, దాని ఉత్పత్తులపై నిషేధం విధిస్తున్నట్లు బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంజీ నవంబరు 7న ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక ఎన్నికల్లో ఓటింగ్ తప్పనిసరి: గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటింగ్‌ను తప్పనిసరి చేసిన తొలి రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. దీని ప్రతిపాదన బిల్లును ఆ రాష్ట్ర గవర్నర్ ఓపీ కోహ్లి ఆమోదించారు. స్థానిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోకపోతే అలాంటి వారికి శిక్ష తప్పదన్నది ఈ బిల్లులోని సారాంశం. వార్తల్లో వ్యక్తులు సీబీడీటీ చైర్‌పర్సన్‌గా అనితా కపూర్ ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) కొత్త చైర్‌పర్సన్‌గా అనితాకపూర్ నవంబరు 5న నియమితులయ్యారు. ఆమె 1978 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్ అధికారిణి. అక్టోబరు 31న ఉద్యోగ విరమణ చేసిన కె.వి.చౌదరి స్థానంలో అనితాకపూర్ బాధ్యతలు చేపట్టారు. 2015 నవంబరు వరకు ఈ హోదాలో కొనసాగుతారు. దక్షిణ కరోలినా గవర్నర్‌గా నిక్కీ హేలీ అమెరికాలోని దక్షిణ కరోలినా గవర్నర్‌గా భారతీయ సంతతికి చెందిన అమెరికన్ నిక్కీ హేలీ రిపబ్లిక్ పార్టీ తరపున నవంబరు 4న రెండోసారి ఎన్నికయ్యారు. ఆమె 57.8 శాతం ఓట్ల తేడాతో ప్రత్యర్థి విన్సెంట్‌పై విజయం సాధించారు. దక్షిణ కరోలినా ప్రప్రథమ మహిళా గవర్నర్‌గానూ, అమెరికాలో మొట్టమొదటి శ్వేత, జాతేతర గవర్నర్‌గా నిక్కీ చరిత్ర సృష్టించారు. గోవా ముఖ్యమంత్రిగా లక్ష్మీకాంత్ పర్సేకర్ గోవా నూతన ముఖ్యమంత్రిగా లక్ష్మీకాంత్ పర్సేకర్ (58) నవంబరు 8న బాధ్యతలు చేపట్టారు. 2012 నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న మనోహర్ పారికర్ కేంద్రమంత్రివర్గంలో చేరడంతో ఆ స్థానంలో పర్సేకర్ నియమితులయ్యారు. ఫోర్బ్స్ జాబితాలో మోదీకి 15వ స్థానం ఫోర్బ్స్ పత్రిక నవంబరు 5న విడుదల చేసిన ప్రపంచ శక్తిమంతుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ 15వ స్థానంలో నిలిచారు. మొత్తం 72 మందితో కూడిన ఈ జాబితాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటి స్థానం, అమెరికా అధ్యక్షుడు ఒబామా రెండో స్థానం, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మూడో స్థానంలో ఉన్నారు. అత్యంత శక్తిమంతమైన మహిళగా అరుంధతీ భట్టాచార్య భారత్‌లో అత్యంత శక్తిమంతులైన 50 మంది మహిళా వ్యాపారవేత్తల జాబితాను ఫోర్బ్స్ నవంబరు 9న విడుదల చేసింది. ప్రథమ స్థానంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య నిలిచారు. ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ చందాకొచ్చర్‌కు రెండో స్థానం, యాక్సిస్ బ్యాంక్ ఎండీ,సీఈఓ శిఖాశర్మ కు మూడో స్థానం దక్కింది. అపోలో హాస్పిటల్ ఎంటర్ ప్రైజెస్ ఎండీ ప్రీతారెడ్డి ఏడో స్థానంలో నిలిచారు. గుల్జార్‌కు హెచ్‌సీయూ గౌరవ డాక్టరేట్ కవి, సినీ దర్శకుడు సంపూర న్ సింగ్ కల్రా (గుల్జార్)కు హైదరాబాద్ కేంద్ర విశ్వ విద్యాలయం (హెచ్‌సీయూ) గౌరవ డాక్టరేట్‌ను నవంబరు 6న అందించింది. సాహిత్య రంగంలో విశేష కృషిని గుర్తిస్తూ వర్సిటీ కులపతి సీహెచ్. హనుమంతరావు గుల్జార్‌కు డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. రాష్ట్రీయం తెలంగాణ తొలి బడ్జెట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ నవంబరు 5న శాసనసభకు సమర్పించారు. మొత్తం రూ. 1,00,637 కోట్ల బడ్జెట్లో ప్రణాళికా వ్యయం రూ. 48,640 కోట్లు కాగా, ప్రణాళికేతర వ్యయం రూ. 51,989 కోట్లు. ప్రధాన రంగాలకు కేటాయింపుల వివరాలు... గ్రామీణాభివృద్ధి: రూ.7,579.45 కోట్లు, సాగునీరు: రూ. 6,500 కోట్లు. వ్యవసాయ, అనుబంధ రంగం: రూ. 3,061.71 కోట్లు. విద్య: రూ. 3,663.26 కోట్లు. వైద్యం: రూ. 2,282.86 కోట్లు. ఆంధ్రప్రదేశ్‌లో హరిత పథకం వ్యవసాయాభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హరిత అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. హరిత పూర్తి రూపం.. హార్మోనైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అగ్రికల్చర్, రెవెన్యూ, ఇరిగేషన్ ఫర్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఎజెండా. వ్యవసాయం, సాగునీటి పారుదల, రెవెన్యూ శాఖల చొరవతో వ్యవసాయాన్ని మెరుగుపరచడమే హరిత పథకం లక్ష్యం. తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే -2014 రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం: 1,14,840 చ.కి.మీ, జనాభా (2011 నాటికి): 3.51 కోట్లు, రాష్ట్ర స్థూల ఆదాయం (జీఎస్డీపీ): రూ. 3,78,963 కోట్లు, తలసరి ఆదాయం: రూ. 93,151, జీఎస్డీపీలో సాగురంగం వాటా: 17 శాతం, పారిశ్రామిక రంగం వాటా: 27శాతం, సేవారంగం వాటా: 56 శాతం, అక్షరాస్యత: 66.46 శాతం, పట్టణ జనాభా: 39 శాతం, అడవుల విస్తీర్ణం: 28.89 శాతం, సాగునీటి సౌకర్యం: 31.64 లక్షల హెక్టార్లు. ఇంటర్నెట్ వినియోగదారుల్లో హైదరాబాద్‌కు ఆరో స్థానం దేశంలో అత్యధిక అంతర్జాల వినియోగదారులున్న నగరాల జాబితాలో హైదరాబాద్ ఆరోస్థానంలో నిలిచింది. భారత ఇంటర్నెట్, సెల్‌ఫోన్ సంఘం నిర్వహించిన అధ్యయనం ప్రకారం దేశం మొత్తం మీద 24.3 కోట్ల మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారని తేలింది. వీరిలో 1.64 కోట్ల మందితో ముంబయి అగ్ర స్థానం, 1.21 కోట్ల మందితో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచాయి. తెలంగాణలో ఆసరా పథకం ప్రారంభం వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు అందించే ఆసరా పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నవంబరు 8న మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో ప్రారంభించారు. పథకం కింద వృద్ధులు, వితంతువులు, మరనేత, కల్లుగీత కార్మికులతోపాటు ఎయిడ్స్ బాధితులకు నెలకు రూ. 1000, వికలాంగులకు రూ. 1,500లు అందజేస్తారు. అంతర్జాతీయం బెర్లిన్ గోడ కూల్చివేతకు పాతికేళ్లు చారిత్రక బెర్లిన్ గోడ కూల్చివేత ఘట్టానికి పాతికేళ్లు నిండాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో కమ్యూనిస్టుల పాలనలోని నాటి తూర్పు జర్మనీ ప్రభుత్వం 1961లో దీన్ని నిర్మించింది. ఆ తర్వాత 1989 నవంబరు 9న తూర్పు జర్మనీ ప్రభుత్వం పశ్చిమ జర్మనీ వెళ్లేందుకు తమ పౌరులను అనుమతించింది. దీంతో ఆ రోజున వేలమంది జర్మన్లు బెర్లిన్ గోడను కూల్చేశారు. ఆ పరిణామమే జర్మనీ ఏకీకరణకు దారితీసింది. సంక్రమించని వ్యాధులతో ప్రధాన ఆరోగ్య సమస్య భారత్‌లో 2012లో 60 శాతం మరణాలు ఒకరి నుంచి ఒకరికి సంక్రమించని వ్యాధుల వల్లనే సంభవించా యని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎకానమిక్స్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఇన్ ఇండియా పేరుతో విడుదలైన నివేదిక ప్రకారం భారత్‌లో 2012-2030 మధ్య కాలంలో ఎన్సీడీలు, మానసిక ఆరోగ్య స్థితుల వల్ల 4.58 ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని తెలిపింది. గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహం, క్యాన్సర్లు మనుషుల ఆరోగ్యానికి, ఆర్థిక వృద్ధికి, దేశాభివృద్ధికి పెద్ద సమస్య గా మారాయని పేర్కొంది. మొనాకోలో ఇంటర్‌పోల్ సదస్సు మొనాకో వేదికగా 83వ ఇంటర్‌పోల్ సదస్సు జరిగింది. నవంబరు 3-7 తేదీల మధ్య సాగిన ఈ సమావేశంలో భారత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొని హిందీలో ప్రసంగించారు. ఈ అంతర్జాతీయ వేదికపై హిందీలో ప్రసంగించడం ఇదే ప్రథమం. 82వ సదస్సు గతేడాది కొలంబియాలోని కార్టెజినాలో జరిగింది. భారత్-శ్రీలంక సంయుక్త సైనిక విన్యాసాలు భారత్-శ్రీలంక దేశాలు నవంబరు 3న సైనిక విన్యాసాలను ప్రారంభించాయి. దీనికి మిత్రశక్తి అని పేరు పెట్టారు. ఈ విన్యాసాలు కొలంబో సమీపంలోని ఓ దీవిలో నవంబరు 23వరకు నిర్వహించనున్నారు. ఆసియా-పసిఫిక్ మంత్రుల సదస్సు దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో గృహ నిర్మాణం-పట్టణాభివృద్ధి ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి ప్లీనరీ నవంబరు 5న జరిగింది. దీనికి కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు హాజరయ్యారు. 2022 నాటికి అందరికీ గృహ వసతి భారత్ లక్ష్యమని ప్రకటించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ జలాంతర్గామి సింధుకీర్తి జల ప్రవేశం భారత నౌకాదళానికి చెందిన ఐ.ఎన్.ఎస్ సింధుకీర్తి జలాంతర్గామి విశాఖపట్టణంలోని హిందూస్థాన్ షిప్‌యార్డ్ బిల్డింగ్ డాక్లో నవంబరు 4న జలప్రవేశం చేసింది. దీన్ని ఐదారునెలల్లో నౌకాదళానికి అప్ప గిస్తారు. ఇది సింధూ ఘోష్‌కు చెందిన డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గామి. బంగాళాఖాతంలో మునిగిన నౌకాదళ నౌక తూర్పు నౌకాదళానికి చెందిన టోర్పెడో రికవరీ వెహికల్ -72 (టీఆర్వీ) నవంబరు 6న బంగాళాఖాతంలో ము నిగిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. దీన్ని యుద్ధ నౌకల నుంచి ప్రయోగాత్మకంగా పేల్చిన టోర్పెడో లను తిరిగి సేకరించడానికి ఉపయోగిస్తారు. అగ్ని-2 పరీక్ష సక్సెస్ మధ్యశ్రేణి అణ్వస్త్ర క్షిపణి అగ్ని-2ని సైన్యం మరోసారి విజయవంతంగా పరీక్షించింది. నవంబర్ 9న ఒడిశా తీరంలోని వీలర్ ఐల్యాండ్‌లో గల ఐటీఆర్ నుంచి దీన్ని ప్రయోగించారు. 20 మీటర్ల పొడవైన ఈ క్షిపణి వెయ్యి కిలోల పేలోడ్లను మోసుకుపోగలదు. క్రీడలు సచిన్ ఆత్మకథ ఆవిష్కరణ మాజీ క్రికెటర్, భారత రత్న సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వే పుస్తకాన్ని అక్టోబరు 5న ముంబయిలో ఆవిష్కరించారు. తొలికాపీని తన తల్లి రజనికి అందించారు. తన 24 ఏళ్ల క్రికెట్ కెరీర్లో ఎదురైన అనుభవాలు, వివాదాలు, తదితర అంశాలను ఈ పుస్తకంలో వెల్లడించారు. జాతీయ స్క్వాష్ విజేతలు సంధు, జ్యోష్న జాతీయ సీనియర్ స్క్వాష్ ఛాంపియన్ షిప్ టైటిల్‌ను హరీందర్ పాల్ సింగ్ సంధు కైవసం చేసుకున్నాడు. నవంబర్ 8న ముంబయిలో జరిగిన ఫైనల్లో సౌరభ్ ఘోషల్‌పై విజయం సాధించాడు. సంధుకిదే తొలి జాతీయ టైటిల్. మహిళల టైటిల్‌ను జ్యోష్న చినప్ప గెలుచుకుంది. ఫైనల్లో సచికా ఇంగాలేని ఆమె ఓడించింది. భువనేశ్వర్‌కు పీపుల్స్ ఛాయిస్ అవార్డు భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్కుమార్కు ప్రతిష్టాత్మక ఎల్.జి పీపుల్స్ చాయిస్ అవార్డు వరించింది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఇందుకు జరిగిన ఓటింగ్‌లో పాల్గొని విజేతను ఎన్నుకొన్నారు. ఈ అవార్డు 2010లో సచిన్, 2011, 2012లో సంగక్కర, 2013లో ఎం.ఎస్. ధోనికి లభించింది. హాకీ సిరీస్ భారత్ కైవసం ఆస్ట్రేలియాతో జరిగిన హాకీ సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. నవంబరు 9న పెర్త్‌లో జరిగిన నాలుగో టెస్ట్‌ను భారత్ గెలవడంతో 3-1 తేడాతో సిరీస్‌ను చేజిక్కించుకుంది. ఆస్ట్రేలియాపై భారత్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. -
ఇంటికెళ్లి పాలు తాగిరామ్మా!
తొలి అంతర్జాతీయ సిరీస్‌ను గుర్తు చేసుకున్న సచిన్ న్యూఢిల్లీ: సచిన్ టెండూల్కర్ ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ ద్వారా... అతని కెరీర్లో, జీవితంలో జరిగిన అనేక సంఘటనలు అభిమానులకు తెలుస్తున్నాయి. వాటిలో బాగా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా 16 ఏళ్ల వయసులో సచిన్ తొలిసారి పాకిస్థాన్ వెళ్లి అంతర్జాతీయ క్రికెట్ ఆడినప్పటి అనుభవాలు మరీ ఆసక్తికరం. ఆ విశేషాలు మాస్టర్ మాటల్లోనే... 1989లో పాకిస్థాన్‌లో నా తొలి అంతర్జాతీయ పర్యటనకు గొప్ప బౌలర్లందరినీ ఒకేసారి ఎదుర్కొన్నాను. అక్రమ్ బౌలింగ్‌లో తొలిసారి ఆడాను. వరుసగా నాలుగు బౌన్సర్లు వేశాడు. నాకు నేనే ‘టెస్టు క్రికెట్‌కు స్వాగతం’ అని చెప్పుకున్నాను. ఇమ్రాన్, అక్రమ్, వకార్, ఆకిబ్, ముస్తాక్ అహ్మద్, అబ్దుల్ ఖాదిర్... ఇంత గొప్ప బౌలర్లను ఆ సిరీస్‌లో ఆడాను. ఆ సిరీస్‌లో నాలుగో టెస్టులో తొలిసారి భయపడ్డాను. వకార్ వేసిన బంతి వచ్చే ఎత్తు విషయంలో పొరబడ్డాను. దీంతో బంతి నా ముక్కుకు తగిలింది. కళ్లు మసకబారాయి. తల బరువుగా అనిపించింది. బంతి ఎటు వెళ్లిందో చూస్తున్నాను. ఈలోగా చొక్కా మీద రక్తం కనిపించింది. ఈ లోగా మియందాద్ దగ్గరకు వచ్చాడు. ‘అరే... నీ ముక్కు పగిలిపోయింది. నువ్వు హాస్పటల్‌కి వెళ్లాలిగా’ అని వెక్కిరించాడు. ఇది చాలదన్నట్లు స్టాండ్స్‌లో ఒక అభిమాని బ్యానర్ తీశాడు. ‘పిల్లాడా... ఇంటికెళ్లి పాలు తాగిరామ్మా’ అని రాశాడు. దీంతో చాలా అసహనంగా అనిపించింది. చాలా భయపడ్డాను అలాగే భారత్-పాక్ సిరీస్ ఎంత ఉద్రిక్తంగా ఉంటుందో కూడా అంతర్జాతీయ క్రికెట్లో నా తొలి రోజే తెలిసింది. లంచ్ తర్వాత సెషన్లో ఒక వ్యక్తి మైదానంలోకి వచ్చాడు. సల్వార్ కమీజ్ వేసుకుని బాగా గడ్డం పెంచుకుని ఉన్నాడు. నేరుగా కపిల్ దగ్గరకు వెళ్లి బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. తర్వాత ప్రభాకర్నీ తిట్టాడు. ఆ వెంటనే కెప్టెన్ శ్రీకాంత్ దగ్గరకి దూసుకెళ్లి కొట్టడం మొదలుపెట్టాడు. ఆ పక్కనే నేను ఉన్నా. చాలా భయపడ్డా. ఇక తర్వాత నా వంతే అనిపించింది. ఒకవేళ నా వైపు వస్తుంటే డ్రెస్సింగ్‌రూమ్‌లోకి వెళదామని నిర్ణయించుకున్నా. అసలు అది క్రికెట్ మ్యాచ్‌లా అనిపించలేదు. -
నన్ను అవమానించారు!
ముంబై: సచిన్ ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’లో సంచలనాలకు కొదువ లేదు. మాస్టర్ తాను చెప్పినట్లుగా ఇప్పటి వరకు బయటికి వెల్లడించని అనేక అంశాలను ఈ పుస్తకంలో ప్రస్తావించాడు. నిజాలే చెప్పానన్న అతను నాటి ఘటనలపై తన ఆగ్రహావేశాలు దాచుకోలేదు. వేర్వేరు అంశాలపై సచిన్ రాసిన విశేషాలు అతని మాటల్లోనే... కనీసం చెప్పలేదు: నన్ను కెప్టెన్సీనుంచి తొలగించిన విధానం చాలా బాధగా, అవమానకరంగా అనిపించింది. బీసీసీఐ నుంచి ఎవరూ నాకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. నేను కెప్టెన్‌ను కాదని మీడియా ద్వారానే తెలిసింది. అయితే అలా చేయడం నేను ఇంకా బాగా ఆడాలనే పట్టుదల నాలో పెంచింది. అయితే నా కోపం మాత్రం తగ్గలేదు. కెప్టెన్సీ బాధనుంచి కోలుకోవడానికి కొంత సమయం పట్టింది’ కోచ్‌గా కపిల్ విఫలం: నేను రెండో సారి కెప్టెన్‌గా వ్యవహరించిన సమయంలో భారత దిగ్గజం కపిల్‌దేవ్ కోచ్‌గా ఉన్నారు. 1999-2000 ఆస్ట్రేలియాలాంటి కఠిన సిరీస్‌లో ఆయన నుంచి నేను చాలా ఆశించాను. జట్టు వ్యూహాలు, ప్రణాళికలు రూపొందించడంలో కోచ్‌దే కీలక పాత్ర అని నేను గట్టిగా నమ్ముతాను. అయితే ఆయన మాత్రం అన్నీ కెప్టెన్‌కే వదిలేశారు. మైదానంలో ఉపయోగపడగల వ్యూహ ప్రతివ్యూహాలు, చర్చల్లో ఆయన పెద్దగా పాల్గొనకపోయేవారు. ఒక కోచ్‌గా కపిల్ నన్ను తీవ్రంగా నిరాశపరిచారు. నన్ను ఒంటరిగా వదిలెయ్: ముల్తాన్ టెస్టులో నేను 194 పరుగులతో ఆడుతున్నాను. మేం ముందుగా అనుకున్నదానికంటే ఒక ఓవర్ ముందే డిక్లరేషన్ జరిగింది. ఇలా చేయడంలో అర్థమే లేదు. నిరాశతో, బాధతో డ్రెస్సింగ్ రూమ్ చేరాను. ఆ సమయంలో చాలా ఆగ్రహంతో ఉన్నాను. జాన్ రైట్ వచ్చి తన తప్పేమీ లేదని క్షమాపణ చెప్పారు. కోచ్‌కే తెలియకపోతే సారీ చెప్పటం ఎందుకన్నాను. గంగూలీ వచ్చి నాకూ తెలీదంటూ సారీ చెప్పినా అదే అన్నాను. చివరికి ఇక నటించలేనంటూ నా అసంతృప్తిని ద్రవిడ్ ముందు ప్రకటించేశాను. జట్టు గెలుపు కోసం నిర్ణయమంటూ అతను చెప్పిన వివరణతో నేను సంతృప్తి చెందలేదు. నేను కూడా జట్టు కోసం ఆడుతున్నానని, 194 పరుగులు జట్టుకే ఉపయోగపడతాయని చెప్పాను. ఈ కోపాన్ని నేను మైదానంలో చూపించను కానీ మైదానం బయట నన్ను ఒంటరిగా వదిలెయ్. కోలుకోవడానికి సమయం పడుతుంది అని ద్రవిడ్‌తో అన్నాను. -
ఆత్మకథ కాదు...పాఠ్యగ్రంథం
ఆత్మకథలు అనేక రకాలు. కొన్ని కేవలం సంచలనం కోసం రాసేవి. మరికొన్ని భవిష్యత్తరాల్లో కూడా స్ఫూర్తినీ, దీప్తినీ నింపేవి. క్రీడాకారుల ఆత్మకథలు మనకు కొత్తేం కాదు. కపిల్, గవాస్కర్, గోపీచంద్... ఇలా అనేకమంది క్రీడాకారుల ఆత్మకథలు ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయి. అయితే క్రికెట్ క్రీడాభిమానుల ఆరాథ్యదైవం సచిన్ టెండూల్కర్ ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ కోసం మాత్రం ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూసింది. గతంలో సచిన్‌పై అనేక పుస్తకాలు వచ్చాయి. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో ఆయన తనకు తానై మీడియాకు ఎన్నో విషయాలు చెప్పాడు. ఇంకా సచిన్ గురించి అభిమానులకు తెలియనిదేమైనా ఉంటుందా? అయినా ఆయన ఆత్మకథపై అంత ఆసక్తి ఎందుకంటే... క్రికెట్ దేవుడి జీవితంలో మనకు తెలియని సంఘటనలు ఉన్నాయేమో తెలుసుకోవాలనే! పుస్తకాన్ని వివాదాస్పద అంశాలతో నింపడం...విడుదలకు ముందు వాటిని బయటపెట్టడం ఈమధ్యకాలంలో తరచుగా కనిపిస్తున్న మార్కెటింగ్ వ్యూహం. సచిన్ కూడా ఆ పనే చేశాడా? గ్రెగ్ చాపెల్ నిరంకుశత్వం గురించి పుస్తకం విడుదలకు ముందే వెల్లడించడం అందులో భాగమా? 24 ఏళ్ల కెరీర్లో ఏనాడూ వివాదాల జోలికి పోని మాస్టర్... తన పుస్తకం ప్రచారం కోసం ఓ కోచ్‌పై వ్యాఖ్యలు చేయాల్సిన పనిలేదు. సచిన్ పుస్తకం అనేక అంశాలను స్పృశించింది. ఆస్ట్రేలియాలో మంకీగేట్ వివాదం, దక్షిణాఫ్రికాలో బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు, ప్రపంచకప్‌లో విజయాలు, ఘోర పరాజయాలు... ఇలా అన్ని విషయాలపైనా ఏదో ఒక సమయంలో మీడియా ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించాడు. అయితే మనసు లోపల దాచుకున్న, వివాదాలను దరి చేరనీయకూడదని భావించిన అంశాలను మాత్రం పుస్తకంలో ప్రస్తావించాడు. ముల్తాన్ టెస్టులో తాను డబుల్ సెంచరీకి చేరువైన సమయంలో కెప్టెన్ డిక్లేర్ చేయడం గురించి తొలిసారి మనసులో మాట బయటపెట్టాడు. ఆ రోజు తాను బాధపడ్డాడనే విషయం ఇప్పుడు చెప్పాడు. అలాగే కపిల్‌దేవ్ కోచ్‌గా పనికిరాలేదని చెప్పడానికి చాలా తెగువ ఉండాలి. సచిన్ ఆ తెగువనూ చూపాడు. నిజాల్ని నిర్భయంగా చెబితేనే అది నిజమైన ఆత్మకథ అవుతుంది. మ్యాచ్ ఫిక్సింగ్ గురించి సచిన్ ఏం చెబుతాడో అని కూడా క్రికెట్ వర్గాలు ఎదురుచూశాయి. కానీ దీని గురించి సచిన్ పెద్దగా స్పందించలేదు. బాధ్యతగల ఓ క్రికెటర్ 24 ఏళ్ల కెరీర్లో ఒక్క సంఘటన కూడా ఎదుర్కోలేదా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. పుస్తకంలో దీనికి జవాబుంది. ‘నేను నేరుగా చూసిన విషయాలు, నాకు తెలిసిన విషయాలు మాత్రమే నేను మట్లాడతా. వేరే వాళ్లు చెప్పిన మాటల ఆధారంగా ఓ అభిప్రాయాన్ని ఎప్పుడూ ఏర్పరుచుకోను’ అని రాశాడు. ఈ పుస్తకంలో వివాదాల గురించి మాత్రమే చర్చ జరుగుతోందిగానీ... ఓ కుర్రాడు ముంబై వీధుల్లో చేసిన అల్లరి, ఆట కోసం పడ్డ కష్టం, ఓ తండ్రి ప్రోత్సాహం, ఓ అన్న మార్గనిర్దేశనం, ఓ గురువు క్రమశిక్షణ.. ఇలా అనేక అంశాలు పుస్తకంలో ఉన్నాయి. ఓ మధ్యతరగతి కుర్రాడు... ప్రపంచం ఆరాధించే వ్యక్తిగా మారడం వెనక దాగి ఉన్న కృషి, పట్టుదల ఉన్నాయి. ఒక వ్యక్తి వరుసగా రెండు రోజులపాటు జరిగిన రెండు శస్త్రచికిత్సల తర్వాత నెల రోజుల్లోనే కోలుకుని బ్యాట్ పట్టుకోవాలంటే ఎంత ఫిట్నెస్ ఉండాలో అంతకు మించిన మానసిక దృఢత్వం ఉండాలి. తండ్రి చనిపోయిన బాధను గుండెల్లో దాచుకుని కోట్లాది మందిని తన బ్యాటింగ్‌తో ఉర్రూతలూగించడానికి ఆత్మస్థైర్యం ఉండాలి. ఇవన్నీ రాత్రికి రాత్రే సచిన్‌కు రాలేదు. వీటన్నిటి గురించి మాస్టర్ ఈ పుస్తకంలో రాశాడు. ఊహ తెలిసినప్పటి నుంచి ఆటే జీవితంగా బతికిన వ్యక్తి... 41 ఏళ్ల వయసులో పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని చెప్పడం చాలా కష్టం. అందులోనూ ఏడాదిలో 300 రోజుల పాటు ప్రపంచాన్ని చుట్టే వ్యక్తికి ఇది చాలా కష్టం. అందుకే ఈ పుస్తకం కోసం మాస్టర్ మూడు సంవత్సరాలు తీసు కున్నాడు. తొలిసారి సైకిల్ ఎక్కినప్పుడు సచిన్ కిందపడి దెబ్బ తగిలించుకు న్నాడు. కానీ నెల రోజుల్లోనే తమ కాలనీలో అందరికంటే వేగంగా సైకిల్ తొక్కే కుర్రాడిగా పేరు తెచ్చుకున్నాడు. తనలోని పట్టుదల, పోరాటతత్వం పెరగడానికి చిన్నప్పుడు జరిగిన ఇలాంటి సంఘటనలే కారణం అని సచిన్ చెప్పాడు. మరి కెప్టెన్‌గా సచిన్ వైఫల్యానికి కారణాలేమిటి? ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్న వ్యక్తి తన జట్టుకు అత్యుత్తమ నాయకుడు ఎందుకు కాలేకపోయాడు? ఆత్మకథలో ఇలాంటి ప్రశ్నలకూ జవాబుంది.ఎంచుకున్న వృత్తిలో అత్యున్నత శిఖరాలకు చేరాలంటే ప్రతి రోజూ నిత్య విద్యార్థిగా ఉండాలని ఆయన జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. తన కెరీర్ చివరి రోజుల్లో కూడా కొత్తగా వచ్చిన యువ ఆటగాళ్ల దగ్గర షాట్స్ నేర్చుకోవడం సచిన్ ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. ఓ వ్యక్తి ఎదిగిన తర్వాత కూడా ఎంత హుందాగా మెలగాలో, దేశానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఎంత బాధ్యతగా వ్యవహరించాలో ఈ పుస్తకం నేర్పుతుంది. విజయాలను మహాద్భుతమని పొగిడినా...వైఫల్యాలపై కటువుగా విమర్శించినా మాస్టర్ స్థితప్రజ్ఞతను ప్రదర్శించాడు. విజయాలను ఆస్వాదిం చినట్టే, వైఫల్యాలనుంచి గుణపాఠాలు నేర్చుకున్నాడు. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు దేశంలో క్రికెట్ అభిమానులకు ఆనందాన్ని పంచిన మాస్టర్... ఆ క్రమంలో తాను కోల్పోయిన వ్యక్తిగత జీవితం చాలా ఉంది. ఈ రోజు భారతరత్న స్థాయికి మాస్టర్ చేరడానికి తన కుటుంబం చేసిన త్యాగాలు, పడ్డ కష్టం ప్రతి వ్యక్తికీ స్ఫూర్తినిచ్చేవే. అందువల్లే ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ యువతలో స్ఫూర్తిని పెంచే గ్రంథం. ఈ తరం క్రికెటర్లకూ... ఆ మాటకొస్తే ఏ రంగంలో పనిచేసేవారికైనా సచిన్ ఆత్మకథ ఓ పాఠ్యగ్రంథంలాంటిది. -
సచిన్ లవ్‌స్టోరీ : సచిన్‌కి ఆ ధైర్యం లేదా ?
-
సచిన్ 'ఆత్మ' చుట్టూ వివాద భూతం
ప్రముఖుల ఆత్మకథలు వెలుగు చూస్తున్నాయంటే చాలూ.. వివాదాల భూతాలు సిద్ధంగా ఉంటాయనేది క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఆత్మకథతో మరోసారి స్పష్టమైంది. గతంలో సంజయ్‌బారు రచించిన 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ద మేకింగ్, అన్‌మేకింగ్', పీసీ పరేఖ్ 'క్రూసేడర్ అండ్ కాన్స్పిరేటర్', ఎల్‌కె అద్వానీ 'మై కంట్రీ.. మై లైఫ్'. నట్వర్ సింగ్ 'వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్'లు విడుదలకు ముందే సంచలనానికి తెర తీసిన సంగతి తెలిసిందే. అయితే సచిన్ కూడా తన ఆత్మకథను పబ్లిసిటీకి వాడుకున్నారా అనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ‘ప్లేయింగ్ ఇట్ మై వే' అంటూ క్రికెట్ దేవుడు సచిన్ తన అనుభవాలను రంగరించి ఆత్మకథ రూపంలో అభిమానులతో పంచుకోవాలనుకున్నారు. వ్యక్తిగత జీవితంలో పలు కీలక అంశాలతోపాటు, క్రీడా రంగంలోని కొన్ని ఉదంతాలును కూడా ఉదహరించారు. అయితే గతంలో భారత క్రికెట్ జట్టుకు కోచ్ గా వ్యవహరించిన గ్రెగ్ చాపెల్ వ్యవహార శైలిని ఈ పుస్తకంలో ప్రస్తావించడం సంచలనానికి తెర తీసింది. ద్రావిడ్, లక్ష్మణ్ లను జట్టు నుంచి తప్పించాలనే ఆలోచన తన దృష్టికి తీసుకు వచ్చారని చాపెల్ పై సచిన్ దుమ్మెత్తి పోశారు. తన అభిప్రాయాల్ని ఛాపెల్ బలవంతంగా ఆటగాళ్లపై రుద్దేవాడని సచిన్ ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ లో వెల్లడించడం పతాక శీర్షికల్ని ఆకర్షించాయి. క్రికెట్ రంగానికి సేవ చేసినంత కాలంలో వివాదాలను బౌండరీ బయటనే ఉంచిన సచిన్ ఒక్కసారిగా ఆత్మకథ ద్వారా వివాదానికి కేంద్ర బిందువయ్యాడు. సచిన్ వ్యాఖ్యలపై చాపెల్ కూడా అంతే స్థాయిలో స్పందించారు. సచిన్ చెప్పేవన్నీ అబద్దాలంటూ చాపెల్ ఎదురు దాడికి దిగారు. దాంతో భారత క్రికెటర్లు సచిన్ కు బాసటగా నిలిచి.. చాపెల్ పై ముప్పేట దాడి చేశారు. భారత జట్టులో చాపెల్ తీసుకున్న వివాదస్పద నిర్ణయాలపై సచిన్ అప్పుడే ఎందుకు స్పందించలేదనే కోణంలో విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత క్రికెటర్లు ఒక్కతాటిపైకి వచ్చిన విధంగా జట్టు ప్రయోజనాల్ని రక్షించడానికి అప్పుడే ఎందుకు చాపెల్ పై తిరుగుబాటు ఎందుకు చేయలేదని వాదన కూడా వినిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ రంగంలో భారత జట్టు ప్రతిష్టపై మచ్చ పడకుండా సచిన్, ఇతర క్రికెటర్లు సహనం పాటించారనే వాదన అంతే మొత్తంలో వినిపిస్తోంది. ఏదిఏమైనా ఆత్మకథలకు వివాద భూతాలకు అవినాభావ సంబంధం ఉందని మరోసారి సచిన్ 'ప్లేయింగ్ ఇట్ మై వే' రుజువు చేసింది. క్రికెట్ ఆటకు దూరమైన తర్వాత కోట్లాది మంది అభిమానులకు చేరువకావాలనే లక్ష్యంతో సచిన్ రాసిన ఆత్మకథ అందర్ని ఆకట్టుకుంటుందని ఆశిద్దాం! Follow @sakshinews -
సచిన్ ఆటోబయోగ్రఫీ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’
-
తెరిచిన పుస్తకం
-
అన్నీ నిజాలే చెప్పా
ముంబై: ఆటోబయోగ్రఫీ ద్వారా సచిన్ టెండూల్కర్ తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు. 24 ఏళ్ల క్రికెట్ కెరీర్‌తో పాటు తనకు ఎదురైన అనుభవాలు, వివాదాలు తదితర అంశాలను పుస్తకంలో వెల్లడించాడు. ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ విడుదల సందర్భంగా ఇందులోని వేర్వేరు అంశాలపై తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నాడు. అందులోని ప్రధానాంశాలు అతని మాటల్లోనే... అప్పుడు అంజలి ఉంది: చాపెల్‌కు, నాకు మధ్య సంభాషణ జరిగినప్పుడు అంజలి అక్కడే ఉంది. ఇదొక్కటి చాలు నేను నిజం చెప్పాననడానికి. కెప్టెన్సీ గురించి నాకూ, చాపెల్‌కు మధ్య జరిగిన సంభాషణ గురించి నేను కావాలనే ద్రవిడ్‌కు చెప్పలేదు. నేను ఆ ఆఫర్‌ను తిరస్కరించగానే విషయం అంతటితో ముగిసిపోయింది. చాపెల్ కోచ్‌గా పని చేసిన తొలి రెండు సిరీస్‌లు నేను జట్టులో లేను. ఆ తర్వాత టీమ్ సభ్యులు కొందరు ఆయనతో పని చేయడం చాలా కష్టంగా ఉందని చెబితే... తొందరపడవద్దు, కొత్త కోచ్ అలవాటు పడేందుకు మనం కాస్త సమయం ఇవ్వాలని మందలించాను. కానీ ఆ తర్వాత ఆటగాళ్లు చెప్పిందే నిజమైంది. పర్యటన బహిష్కరిద్దామనుకున్నా: 2007-08 సిడ్నీ టెస్టులో ‘మంకీ గేట్’ ఉదంతం అనూహ్యం. ఆ మ్యాచ్‌లో చాలా సేపు సైమండ్స్, హర్భజన్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. చివరకు భజ్జీలో ఓపిక నశించింది. అతను తేరీ మా కీ...అనే అన్నాడు. ఇది ఆగ్రహం వ్యక్తం చేసేందుకు మనం భారత్‌లో తరచుగా వాడుతూనే ఉంటాం. దానిని ‘మంకీ’గా భావించి ఆస్ట్రేలియా జట్టు ఫిర్యాదు చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఆ మ్యాచ్‌లో చాలా మంది ఆసీస్ ఆటగాళ్ల ప్రవర్తన కూడా క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. మా వాదన వినకుండా ఆసీస్‌కు అనుకూలంగా విచారణ సాగింది. మమ్మల్మి అబద్ధాలకోరుగా రిఫరీ ప్రాక్టర్ భావించడం నాకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. హర్భజన్‌పై నిషేధం తొలగించకపోతే పర్యటన రద్దు చేసుకుందామని నేను, కెప్టెన్ కుంబ్లే కలిసి నిర్ణయించుకున్నాం. ఈ ఘటన తర్వాత పెర్త్ టెస్టు గెలవడం నిజంగా గొప్ప జ్ఞాపకం. బాటిల్స్ కొద్ది షాంపేన్‌తో సంబరాలు చేసుకున్నాం. గిల్‌క్రిస్ట్, బ్రెట్‌లీ మా డ్రెస్సింగ్‌రూమ్‌కు వచ్చి అభినందించడం మరచిపోలేనిది. మైదానం బయటా అదే ఒత్తిడి: జట్టు కెప్టెన్సీ వ్యక్తిగా కూడా నాపై ఒత్తిడి పెంచింది. ఎప్పుడు ఓటమి ఎదురైనా చాలా బాధ కలిగేది. నేను కుటుంబంతో ఉన్న సమయంలో కూడా దాని ఆలోచనలే వచ్చేవి. ఇవన్నీ నాపై ప్రభావం చూపించాయి. కెప్టెన్‌గా నా వైఫల్యానికి ఎవరినీ నిందించను. నాడు భారీ స్కోర్లు చేయగల బ్యాట్స్‌మెన్, 20 వికెట్లు తీయగల బౌలర్లు మనకు లేరని మీకర్థమవుతుంది. సమయం కోసం ఎదురు చూశా: కెరీర్‌కు ఒకే ఒక్క రిటైర్మెంట్ ఉండాలి. అది ఎప్పటికీ నా ఆఖరి మ్యాచ్ కావాలి అనేది నా నమ్మకం. ఇప్పుడు రిటైర్ అవుతాడా, తర్వాత అవుతాడా అనే సందేహాలు జనంలో ఉండరాదు. నాకు దానిపై స్పష్టత ఉంది కాబట్టే అదృష్టవశాత్తూ అనుకున్న విధంగా తప్పుకోగలిగాను. ప్రపంచ కప్ గెలవగానే రిటైర్మెంట్ గురించి ఆలోచించలేదు. ఎందుకంటే నేను 21 ఏళ్ల పాటు ఎదురు చూసిన ఆ క్షణాలు ఆస్వాదిస్తున్నాను. నన్ను నేను అద్దంలో చూసుకోవాలంటూ ఇయాన్ చాపెల్లాంటి వ్యక్తుల విమర్శలు పట్టించుకోలేదు. ఆయన నాకన్నా ఎన్నో ఎక్కువ సార్లు విఫలమయ్యాడు. వీబీ సిరీస్‌లో సెంచరీ సాధించి నా బ్యాట్‌తోనే సమాధానమిచ్చా. తర్వాత ఈ విషయంపై చాపెల్‌ను కడిగేశాను కూడా. టాంపరింగ్ వివాదంతో పాఠం నేర్చుకున్నా: దక్షిణాఫ్రికాలో బాల్ టాంపరింగ్ వివాదం కూడా నాకు సంబంధం లేనిది. నేను టాంపరింగ్ చేశానని కొందరు చెప్పగానే షాక్‌కు గురయ్యా. అప్పుడు బంతి సీమ్‌పై మట్టి తొలగిస్తున్నాను. అదే విషయాన్ని అంపైర్లతో చెబుతూ బంతిలో ఏమైనా మార్పు వచ్చిందా అని అడిగితే లేదన్నారు. విచారణ సందర్భంగా రిఫరీకి కూడా అదే స్పష్టం చేశాను. ఇకపై ఇలాంటిది ఉంటే అంపైర్లకు చెప్పాలని ఆయన హెచ్చరించారు. అంతే...ఆ తర్వాత భవిష్యత్తులో ఏ టెస్టులోనైనా నేను సీమ్ శుభ్రం చేస్తే అంపైర్లకు చెప్పడం, వారు నవ్వడం రొటీన్‌గా మారిపోయింది. వివాదంతో నేను నేర్చుకున్న పాఠమిదే. నేనూ రాతగాడినే... నా కుటుంబంలో నాన్నతో పాటు సోదరులంతా మంచి రచయితలే. అందుకే నేను కూడా బాగానే రాశానేమో. నా జీవితంలో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాను. నాకు తెలిసింది అందరితో పంచుకున్నాను. ప్రతీది చెప్పలేకపోయిన నాకు నచ్చిన విధంగా పుస్తకం రాశాను. పరుగులు చేయాల్సిన బాధ్యత ఉన్నప్పుడు పుస్తకం రాయలేం. అందుకే రిటైర్మెంట్ తర్వాత ఆ పని చేశా. అన్నీ నిజాలే రాశాను. సరదా ఘటనలు, వివాదాలు, నా వ్యక్తిగత జీవితంలో వీలైనన్ని ఎక్కువ అంశాలు కవర్ చేశాను. గత మూడేళ్లుగా దీనిపై పని చేశాను. ముఖ్యంగా నాకు, అంజలికి మధ్య ఉన్న అనుబంధం గురించి రాయడానికే కాస్త ఎక్కువ శ్రమించాను. ఎందుకంటే అందులో చాలా విషయాలు బయటి ప్రపంచానికి తెలియనివి. భారత జట్టుకు దూరమయ్యాననే బాధ లేదు. ఎంసీసీ మ్యాచ్ ఆడాక నా శరీరాన్ని చూస్తే సరైన నిర్ణయం తీసుకున్నాననిపించింది. జట్టు సభ్యులందరిని సోదరులుగానే భావించాను. ఫిక్సింగ్ గురించి తెలీదు: నాకు 100 శాతం తెలిసినవాటినే నేను పుస్తకంలో రాశాను. ఎందుకంటే రేపు నేను వాటిని సమర్థించుకోగలను. కానీ నాకు పూర్తిగా తెలియని అంశాలపై వ్యాఖ్య చేయలేను. కాబట్టి వాటి గురించి మాట్లాడటం సరైంది కాదు. ఒక సాక్ష్యం లాంటిది నా వద్ద ఉంటే వివరంగా మాట్లాడటంలో అర్థముంది. దానిని జనం కూడా ఆమోదిస్తారు. అందుకే ఫిక్సింగ్ అంశంపై ఏమీ చెప్పలేదు. కొంత మంది క్రికెటర్లు కావాలని బాగా ఆడకపోవడం అనేదానిని నేను నమ్మను. మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన కావాలనే అలా చేశాడని వేలెత్తి చూపడం సరైంది కాదు. 24 ఏళ్ల పాటు ఆడాను. ఆటలోనూ, జీవితంలోనూ ప్రతీ ఒక్కరికి వైఫల్యాలు సహజం. కీలక విషయాలపై నేను స్పందించలేదనే విమర్శ ఉంది. నా పుస్తకంలో వాటన్నింటికీ సమాధానం ఉంది. నాకు కచ్చితంగా తెలిసిన అన్ని విషయాల గురించి మనసు విప్పి మాట్లాడాను. ఎవరినుంచో విన్నవి, బయటి వ్యక్తులు చెప్పినవాటి ఆధారంగా వ్యాఖ్యలు చేయదల్చుకోలేదు. -
'అప్పుడు అంజలి నా పక్కనే ఉంది'
ముంబై: సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే' పుస్తకాన్ని అభిమానులకు అంకితం ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఈ పుస్తకాన్ని బుధవారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ పుస్తకం రూపొందించడానికి మూడేళ్లు పట్టిందని సచిన్ తెలిపాడు. తన అన్న అజిత్ అనుక్షణం అండగా నిలిచాడని వెల్లడించాడు. ద్రవిడ్ ను తప్పించి గ్రెగ్ చాపెల్ తనకు కెప్టెన్సీ ఇస్తానన్నప్పుడు తన భార్య అంజలి పక్కనే ఉందని తెలిపాడు. క్రికెటర్ భార్యగా ఉండడం తేలికైన విషయం కాదని పేర్కొన్నాడు. సచిన్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి గవాస్కర్, రవిశాస్త్రి, గంగూలీ, ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, హర్షబోగ్లే తదితరులు హాజరయ్యారు. తొలికాపీని మాస్టర్ బ్లాస్టర్ తన తల్లి రజనీకి స్వయంగా అందించాడు. రెండో కాపీని తన కోచ్ రమాకాంత్ అచ్రేకర్ కు బహుకరించాడు. -
సచిన్ ఆత్మకథలో అసలేముంది ?
-
సచిన్ చెప్పినవన్నీ వాస్తవాలే:లక్ష్మణ్
న్యూఢిల్లీ: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే' లో టీమిండియా మాజీ కోచ్ గ్రేగ్ ఛాపెల్ గురించి ప్రస్తావించిన విషయాలన్నీ వాస్తవాలేనని వీవీఎస్ లక్ష్మణ్ స్పష్టం చేశాడు. ఛాపెల్ కోచ్ గా ఉన్నన్నాళ్లూ ఓ రింగ్ మాస్టర్ లా వ్యవహరించేవాడని సచిన్ పేర్కొన్న విషయాలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే సచిన్ ఆత్మకథను సమర్ధించిన సౌరభ్ గంగూలీకి తాజాగా లక్ష్మణ్ జత కలిశాడు. 'సచిన్ ఆత్మకథ పుస్తకంలో రాసిన విషయాలన్నీ వాస్తవాలే. ఛాపెల్ కోచ్ గా ఉన్న 2005 నుంచి 2007 కాలంలో అన్నీ వివాదాలే. ఆటగాళ్లు అతని చెప్పుచేతల్లోనే ఉండాలని ఛాపెల్ భావించేవాడు' అని లక్ష్మణ్ పేర్కొన్నాడు. 2006 వ సంవత్సరంలో ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో ఇంగ్లండ్ తో టెస్టు మ్యాచ్ జరిగిన సమయంలో నన్న ఓపెనింగ్ చేయమని ఛాపెల్ చెప్పాడని.. అయితే ఆ ఓపెనింగ్ విషయాన్ని తాను తిరస్కరించానన్నాడు. కాగా, మళ్లీ ఇదే అంశాన్ని ఛాపెల్ తన వద్ద ప్రస్తావించి బెదిరింపులకు పాల్పడ్డ విషయాన్ని లక్ష్మణ్ గుర్తు చేసుకున్నాడు. వెస్టిండీస్ టూర్ కు వెళ్లే సమయంలో ఓపెనింగ్ చేయాలని తనను ఛాపెల్ ఇబ్బంది పెట్టాడనన్నాడు. ఒకవేళ ఓపెనింగ్ చేపట్టకపోతే 31 ఏళ్లలో తిరిగి జట్టులోకి రావడం కష్టసాధ్యమవుతుందని ఛాపెల్ బెదరించిన మాట వాస్తవమేనని లక్ష్మణ్ తెలిపాడు.ఛాపెల్ కోచ్ గా ఉన్న కాలంలో డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం దారుణంగా ఉండేదన్నాడు. ఆటగాళ్ల మధ్య చిచ్చుపెట్టడానికే ఛాపెల్ యత్నించేవాడని లక్ష్మణ్ మండిపడ్డాడు. అతని వల్ల భారత్ క్రికెట్ చాలా నష్టపోయిందని విమర్శించాడు. -
సచిన్ చెప్పేవన్నీ అబద్ధాలే..!
-
సచిన్ టెండూల్కర్ చెప్పేవన్ని అబద్దాలు: చాపెల్
సిడ్నీ: సచిన్ టెండూల్కర్ చెప్పేవన్ని అబద్దాలేనని భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ గ్రేగ్ చాపెల్ అన్నారు. రాహుల్ ద్రవిడ్ ను జట్టు నుంచి తప్పించే ప్రయత్నాలు తాను చేయలేదని గ్రేగ్ చాపెల్ వివరణ ఇచ్చారు. ఛాపెల్ తన అభిప్రాయాల్ని బలవంతంగా ఆటగాళ్లపై రుద్దేవాడని, ద్రావిడ్, లక్ష్మణ్ లనూ తప్పించాలని చాపెల్ వ్యూహం పన్నాడని సచిన్ తన ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ లో వెల్లడించడం తాజా వివాదానికి కేంద్ర బిందువైంది. Follow @sakshinews -
అప్పుడే రిటైర్ కావాలనుకున్నా...
ముంబై: సచిన్ టెండూల్కర్... ప్రపంచ క్రికెట్‌కు ఏమాత్రం పరిచయం అక్కరలేని పేరు. ఓ రకంగా ‘క్రికెట్ దేవుడు’గా అభిమానులు అభివర్ణించే ఆటగాడు. దాదాపు అన్నిరకాల రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఈ అద్వితీయ దిగ్గజం నిజానికి చాలాకాలం క్రితమే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని భావించాడట. సచిన్ కెరీర్లో దారుణ వైఫల్యమేదైనా ఉంటే అది తను భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన కాలం. నాయకుడిగా ఘోరంగా విఫలమైన ‘మాస్టర్’ ఆ సమయంలోనే క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఈనెల 6న మార్కెట్లోకి రానున్న సచిన్ ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’లో ఇలాంటి పలు ఆసక్తికర విషయాలను పొందుపరిచారు. రెండు దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్లో పలు చీకటి రోజులను ఈ సందర్భంగా 41 ఏళ్ల సచిన్ ఆ పుస్తకంలో గుర్తుచేసుకున్నాడు. కెరీర్ ముగిసిందనుకున్నా: నా సారథ్యంలో వరుసగా ఓటములు రావడంతో అసహ్యం కలిగింది. జట్టు కెప్టెన్‌గా వాటికి నాదే బాధ్యత. ఇంకా దారుణమేమిటంటే ఈ పరిస్థితి నుంచి ఎలా బయటికి రావాలో తెలీకపోవడం. ఎందుకంటే అప్పటికే నా అత్యుత్తమ ఆటతీరును ఆడేందుకు ప్రయత్నిస్తున్నా. ఇక పరాజయాలను ఆపేందుకు నా దగ్గర ఏమీ లేదనే భయం కలిగింది. ఈ విషయాన్ని నా భార్య అంజలికి కూడా చెప్పాను. గెలవాల్సిన చాలా మ్యాచ్‌లు ఓడిపోవడం భయం కలిగించింది. కనీసం 0.1 శాతం కూడా పోరాడలేననే భావనకు వచ్చాను. ఈ అపజయాల నుంచి కోలుకోవడానికి చాలాకాలం పట్టింది. ఓ దశలో క్రికెట్‌కు పూర్తిగా దూరమైతే ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా ఆలోచించాను. విండీస్ పర్యటన పీడకల: 1997, మార్చి 31.. భారత క్రికెట్ చరిత్రలో ఇది చీకటి రోజే కాకుండా నా కెప్టెన్సీ కెరీర్లో కూడా అత్యంత చెత్త రోజుగా భావించవచ్చు. అప్పటికే విండీస్‌తో రెండు టెస్టులు ‘డ్రా’ అయ్యాయి. మూడో టెస్టులో విజయం దిశగా వెళుతున్నాం. 120 పరుగులు చేస్తే చాలు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే ఆలౌటై దారుణంగా ఓడాం. ఈ ఓటమి నన్ను దారుణంగా దెబ్బతీసింది. రెండు రోజుల పాటు గది నుంచి బయటకు రాలేకపోయాను. ఆటగాళ్లపై అరిచాను: ఇక టెస్టు సిరీసే అనుకుంటే ఆ తర్వాత వన్డే సిరీస్ కూడా 1-4తో ఓడాం. మూడో వన్డేలో చివరి 10 ఓవర్లలో 47 పరుగులు చేస్తే చాలు. చేతిలో ఆరు వికెట్లున్నాయి. భారీ షాట్లకు వెళ్లకుండా నిదానంగా ఆడమని నేను పదేపదే ఆటగాళ్లకు చెబుతూనే ఉన్నాను. అయినా మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అదేపనిగా గాల్లోకి షాట్లు ఆడి పెవిలియన్‌కు చేరారు. విజయం నుంచి ఓటమికి వెళ్లిన పరిస్థితి చూసి తట్టుకోలేకపోయాను. మ్యాచ్ అనంతరం మీటింగ్ ఏర్పాటు చేసి ఆటగాళ్లపై గట్టిగా అరిచాను. ఇలాంటి ఆట సరికాదని సూటిగా చెప్పాను. ఆ తర్వాత నా గదికి కుంబ్లే, శ్రీనాథ్ వచ్చి ఓదార్చారు. -
సచిన్ ఆత్మకథ.. 'ప్లేయింగ్ ఇట్ మై వే'!