తెలుగులోకి సచిన్ ఆత్మకథ | sachin Tendulkar's book to be published in regional languages | Sakshi
Sakshi News home page

తెలుగులోకి సచిన్ ఆత్మకథ

Published Tue, Nov 11 2014 4:29 PM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM

తెలుగులోకి సచిన్ ఆత్మకథ

తెలుగులోకి సచిన్ ఆత్మకథ

ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే'కు అమితాదరణ లభిస్తోంది.  అభిమానుల కోసం ఈ పుస్తకాన్ని వివిధ ప్రాంతీయ భాషల్లో ప్రచురించనున్నారు. సచిన్ ఆత్మకథను తెలుగులో సహా ఇతర భారతీయ ప్రాంతీయ భాషల్లోకి అనువాదం చేయాలని నిర్ణయించారు.

హచెట్ ఇండియా సహ పబ్లిషర్గా వ్యవహరించనుంది. వివిధ భాషల పబ్లిషర్స్తో చర్చలు జరుపుతున్నట్టు హచెట్ ఇండియా పబ్లిషర్ పౌలోమి ఛటర్జీ చెప్పారు. తెలుగు భాషతో పాటు మరాఠీ, హిందీ, మలయాళం, అస్సామీ, బెంగాలీలో ప్రచురించాలని భావిస్తున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నారు. నవంబర్ 6న విడుదలైన సచిన్ ఆత్మకథకు మార్కెట్లో భలే డిమాండ్ ఏర్పడింది. రెండు లక్షల కాపీలు అమ్ముడయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement