ఆత్మకథ తొలి కాపీని అమ్మకు ఇచ్చిన సచిన్ | Sachin Tendulkar presents 1st copy of autobiography to mom | Sakshi
Sakshi News home page

ఆత్మకథ తొలి కాపీని అమ్మకు ఇచ్చిన సచిన్

Published Wed, Nov 5 2014 4:14 PM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM

ఆత్మకథ తొలి కాపీని అమ్మకు ఇచ్చిన సచిన్

ఆత్మకథ తొలి కాపీని అమ్మకు ఇచ్చిన సచిన్

కేవలం క్రీడా ప్రేమికులే కాదు.. యావత్ ప్రపంచం ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సచిన్ టెండూల్కర్ ఆత్మకథ పుస్తకం వచ్చేసింది.

కేవలం క్రీడా ప్రేమికులే కాదు.. యావత్ ప్రపంచం ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సచిన్ టెండూల్కర్ ఆత్మకథ పుస్తకం వచ్చేసింది. 'ప్లేయింగ్ ఇట్ మై వే' అనే పేరుతో సచిన్ రాసిన ఈ పుస్తకం విడుదలకు ముందే విపరీతమైన సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. పుస్తకం తొలి కాపీని మాస్టర్ బ్లాస్టర్ తన తల్లి రజనీకి స్వయంగా అందించాడు. తన ఆత్మకథ తొలి కాపీని అమ్మకు ఇచ్చానని, ఆమె ముఖంలో కనిపించిన గర్వం అమూల్యమని ట్విట్టర్లో కామెంట్ కూడా పెట్టాడు.

దాంతోపాటు తన తల్లికి పుస్తకం ఇస్తున్న ఫొటోను సైతం ఉంచాడు. 200 టెస్ట్ మ్యాచ్లు ఆడి రికార్డు సృష్టించిన తర్వాత సచిన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇక టెండూల్కర్ తన పుస్తకంలో.. భారత జట్టు మాజీ కోచ్ ఛాపెల్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పించడం, అది తీవ్ర వివాదాస్పదం కావడం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement