ఐశ్వర్య ఆత్మకథ | Aishwaryaa R. Dhanush pens her autobiography | Sakshi
Sakshi News home page

ఐశ్వర్య ఆత్మకథ

Published Wed, Mar 23 2016 4:27 PM | Last Updated on Sun, Sep 3 2017 8:24 PM

ఐశ్వర్య ఆత్మకథ

ఐశ్వర్య ఆత్మకథ

చెన్నై:  చిత్ర నిర్మాతగా తన  టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న ఐశ్వర్య ధనుష్ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు, కోలీవుడ్ స్టార్  ధనుష్ సతీమణి  అయిన ఐశ్వర్య  తన  ఆత్మకథ రాస్తోందట.  తన నిజ జీవితంలోని సంఘటనలు, జ్ఞాపకాలతో కూడిన పుస్తక రచన చేస్తున్నట్టు  ఆమె తెలిపింది.

 'స్టాండింగ్ ఆన్ యాన్ ఆపిల్ బాక్స్' అనే టైటిల్ తో తన జీవిత కథను త్వరలోనే విడుదల చేయనున్నట్టు ఐశ్వర్య స్పష్టం చేసింది.  ఈ ఏడాది చివరి నాటికి తన రచన పూర్తి కావచ్చని  తెలిపింది.  సెలబ్రిటీ కూతురుగా, హీరో భార్యగా, తల్లిగా వివిధ భావోద్వేగాల మిశ్రమంగా తన పుస్తకం ఉంటుందని పేర్కొన్నారు.

తాను రాస్తుంది తొలిసారి అయినప్పటికీ... తన జీవిత కథ పాఠకులకు మంచి అనుభూతులను మిగులుస్తుందని ఐశ్వర్య ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. సహజంగా ముభావంగా ఉండే  తన వ్యక్తిగత జీవితంలోని ఉత్థాన పతనాలు, ఆగ్రహం, అభినందనలతో పాటు కొన్ని ఫిలాసఫికల్ అంశాలు కూడా ఉంటాయని ఆమె వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement