తారాచౌదరి బావ అరెస్ట్‌ | Tara chowdary Brother in law Arrested in Cheating Case | Sakshi
Sakshi News home page

తారాచౌదరి బావ అరెస్ట్‌

Published Sat, Dec 22 2018 9:20 AM | Last Updated on Sat, Dec 22 2018 9:20 AM

Tara chowdary Brother in law Arrested in Cheating Case - Sakshi

చావా రాజ్‌కుమార్‌ ,తారా చౌదరి

బంజారాహిల్స్‌: తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడమేగాక తన ఆస్తులపై కన్నేసి ఇబ్బందులకు గురి చేసిన మేన బావపై సినీ నటి తారా చౌదరి అలియాస్‌ రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుడు చావా రాజ్‌కుమార్‌ను శుక్రవారం అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐ ఉదయ్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీనగర్‌కాలనీ గణపతి కాంప్లెక్స్‌ సమీపంలో నివసించే రాజేశ్వరి అలియాస్‌ తారా చౌదరి ఇంటికి 2016 నవంబర్‌లో వరుసకు బావ అయిన చావా రాజ్‌కుమార్‌ అతని సోదరి సుజాత ఇద్దరూ వచ్చారు.  తారా చౌదరిని పెళ్లి చేసుకుంటానని రాజ్‌కుమార్‌ చెప్పగా నీకు ఇంతకు ముందే పెళ్ళి అయింది కదా ఎలా చేసుకుంటావంటూ ఆమె ప్రశ్నించింది. మొదటి భార్యకు విడాకులు ఇస్తాడని అతని సోదరి సుజాత చెప్పింది.

అందుకు తారా చౌదరి ఒప్పుకోకపోవడంతో రాజ్‌కుమార్‌ ఆమెను బెదిరించి లోబర్చుకున్నాడు. అనంతరం గణపతి కాంప్లెక్స్‌ సమీపంలోని ఆమె అపార్ట్‌మెంట్‌లోనే ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజ్‌కుమార్‌ ఆమె ఆస్తులను అమ్మి డబ్బు ఇవ్వాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నాడు. అందుకు తారాచౌదరి నిరాకరించడంతో వారి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. రెండేళ్లుగా తాము భార్యాభర్తల్లా కలిసి ఉన్నామని తన జీవితాన్ని నాశనం చేశాడంటూ ఈ నెల 10న తారా చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రతిరోజూ స్టేషన్‌కు వచ్చి ఇంకా ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదంటూ పోలీసులపై ఒత్తిడి చేస్తుండటంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం గుంటూరులో అతడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement