
'సీఐపై ఫిర్యాదు చేసినందుకు దాడి'
ఓ సీఐ అవినీతి గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందించాననే కక్షతో తనను కిడ్నాప్ చేసి హతమార్చేందుకు యత్నించారని ఓ యువకుడు తెలిపాడు.
గుంటూరు: ఓ సీఐ అవినీతి గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందించాననే కక్షతో తనను కిడ్నాప్ చేసి హతమార్చేందుకు యత్నించారని ఓ యువకుడు తెలిపాడు. వినుకొండకు చెందిన రావెళ్ళ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం వినుకొండ టౌన్ సీఐ శివసుబ్రమణ్యం పట్టణంలోని అవినీతికి పాల్పడుతున్నడని వారం రోజుల కిందట ఫోన్ ద్వారా ఉన్నతాధికారులకు వివరాలు అందించాడు. దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుసుకున్న సీఐ కక్ష కట్టాడు.
ఈ క్రమంలో మంగళవారం వినుకొండలో సిద్దార్థనగర్ సమీపంలో ద్విచక్రవాహనంపై వెళుతున్నాను. అప్పటికే అక్కడ కాపు కాచి ఉన్న కొండలు, రామకృష్ణ, అప్పారావు, ముకేష్, వెంకట్, శ్యామ్ వాహనాన్ని అడ్డగించారు. బలవంతంగా కారులో ఎక్కించుకుని అటవీప్రాతంలోకి తీసుకువెళ్లి సీఐపై ఫిర్యాదు చేస్తావా అంటూ దుర్భాషలాడి కరల్రతో తీవ్రంగా కొట్టారు.
అటువైపుగా వ్యక్తులు వస్తున్నట్లు అలికిడి కావటంతో పక్కకు వెళ్లడంతో అక్కడినుంచి తప్పించుకుని ఇంటికి చేరాడు. సోదరి తారాచౌదరి సాయంతో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నాడు. తన సోదరి సోమవారం సాయంత్రం కారులో వస్తుండగా కారును అటకాయించి దుర్భాషలాడారని వివరించాడు. సీఐ నుంచి ప్రాణరక్షణ కల్పించాలని ఎస్పీని కలిసి కోరనున్నట్లు తెలిపాడు.